...
...
Next Story

పాత వర్సెస్ కొత్త- Mahindra Scorpio N ఫేస్​లిఫ్ట్​​లో కనిపించే మార్పులు ఇవే..

మహీంద్రా స్కార్పియో-ఎన్ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2022లో లాంచ్ అయిన మోడల్​కి లేటెస్ట్​గా ఎంట్రీ ఇచ్చిన ఫేస్​లిఫ్ట్ వర్షెన్​కి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Aug 11, 2026, 09:59:15 IST
Advertisement

మార్కెట్లో సంచలనం సృష్టించిన మహీంద్రా స్కార్పియో ఎన్​కి సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ ఇటీవలే లాంచ్​ అయ్యింది. నాలుగు సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు సరికొత్త హంగులు అద్దారు. బయటి నుంచి చూసేందుకు అచ్చం అలాగే రగ్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ, క్యాబిన్‌ లోపలి భాగాన్ని మాత్రం పూర్తిగా మార్చేశారు. సరికొత్త డ్యాష్‌బోర్డ్, పెద్ద స్క్రీన్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో దీనిని మరింత లగ్జరీగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో పాత మోడల్‌తో పోలిస్తే 2026 మహీద్రా స్కార్పియో ఎన్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్, ధరల పరంగా ఏ విధంగా మారిందో ఇక్కడ చూసేద్దాము..

పాత వర్సెస్ ఫేస్​లిఫ్ట్- మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ డిజైన్, లుక్..

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్..

స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో మహీంద్రా పెద్దగా మార్పులు చేయలేదు! ఈ బడా ఎస్‌యూవీకి సరికొత్త లుక్ తీసుకురాడానికి కొత్త డిజైన్ గల డ్యూయల్-టోన్ 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌ను మాత్రం జతచేశారు. బాక్సీ షేప్, సిక్స్-స్లాటెడ్ గ్రిల్, ఎల్ఈడీ లైట్లు, రూఫ్ రెయిల్స్ అన్నీ పాత మోడల్ మాదిరిగానే కొనసాగుతున్నాయి. మొత్తానికి స్కార్పియో ఎన్ ఎస్​యూవీ​కి ఉన్న టఫ్ అండ్ బోల్డ్ రోడ్ ప్రెజెన్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రూపుదిద్దుకుంది.

పాత వర్సెస్ ఫేస్​లిఫ్ట్- మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంటీరియర్..

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. పాత 9-ఇంచ్ స్క్రీన్‌ స్థానంలో సరికొత్త 12.3-ఇంచ్ ఫ్రీస్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. దీనికి తగినట్లుగా సెంటర్ కన్సోల్ డిజైన్‌ను కూడా మార్చేశారు. ఏసీ వెంట్లను స్క్రీన్ కింద హారిజాంటల్‌గా అమర్చగా, బ్లాక్-అండ్-బ్రౌన్ అప్‌హోలిస్ట్రీ క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

ఎస్​యూవీ ఫీచర్ల జాబితాలో భారీ మార్పులే జరిగాయి. సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్‌ స్థానంలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. సెమీ-అలాగ్‌ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తొలగించి 10.25-ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లేను ఇచ్చారు. ముందు కూర్చునే వారి సౌకర్యం కోసం 65వాట్ టైప్-సీ ఫాస్ట్-చార్జింగ్ పోర్ట్ ఉంది. ఆఫ్‌రోడింగ్ డేటా చూపించేందుకు 'అడ్వెంచర్ స్టాటిస్టిక్స్' మోడ్‌ను కూడా ప్రవేశపెట్టారు. భద్రత కోసం 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

పాత వర్సెస్​ ఫేస్​లిఫ్ట్- ఇంజిన్, గేర్‌బాక్స్..

కాగా అదనపు ఫీచర్ల కారణంగా ధరలు కొద్దిగా పెరిగాయి. పాత మోడల్‌తో పోలిస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ. 83,500 వరకు ధర పెరిగింది. దీని ప్రారంభ ధర రూ. 13.69 లక్షల నుంచి మొదలవుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe