వన్‌ప్లస్ సంస్థ తన అఫార్డిబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన వన్‌ప్లస్ 15ఆర్ 5జీని ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు లాంచ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2తో కలిసి వచ్చే నెలలో దేశంలో అరంగేట్రం చేయనుంది. భారత లాంచ్ తేదీతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో కూడా కంపెనీ వెల్లడించింది. ఈ రెండు కొత్త పరికరాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉండవచ్చో ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ- ఇండియా లాంచ్ డేట్

వన్‌ప్లస్ 15ఆర్ 5జీ, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 భారతదేశంలో డిసెంబర్ 17, 2025న లాంచ్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ చార్‌కోల్ బ్లాక్, మింటీ గ్రీన్ అనే రెండు రంగుల ఆప్షన్లలో టీజ్ చేయబడింది.
టాబ్లెట్ (ప్యాడ్ గో 2) మాత్రం షాడో బ్లాక్, లావెండర్ డ్రిఫ్ట్ రంగు ఆప్షన్లలో వస్తుంది.
అధికారిక లాంచ్ తర్వాత ప్రీ-ఆర్డర్ లేదా సేల్ ప్రారంభమైనప్పుడు ఈ రెండు పరికరాలు అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ 15ఆర్ మొబైల్‌కు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66 + ఐపీ68 + ఐపీ69 + ఐపీ69కే వంటి అధిక డ్యూరబుల్ బిల్డ్ రేటింగ్‌లు ఉంటాయని కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇది దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో అమర్చిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ: ఫీచర్స్ (అంచనా)
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ మొబైల్‌లో 6.83-ఇంచ్ 1.5కే ఎల్‌టీపీఎస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండవచ్చని అంచనా. ఈ డిస్‌ప్లే 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి భారీ 7,800ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుందని, అలాగే 120డబ్ల్యూ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}ఈ స్మార్ట్‌ఫోన్‌కి భారీ 7,800ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుందని, అలాగే 120డబ్ల్యూ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}ధర విషయానికి వస్తే, వన్‌ప్లస్ 15ఆర్ 5జీ మొబైల్ భారతదేశంలో సుమారు రూ. 45,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 15ఆర్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 వినియోగదారుల కోసం ఎలాంటి ఫీచర్లను తీసుకొస్తాయో కచ్చితంగా తెలుసుకోవడానికి మనం లాంచ్ వరకు వేచి చూడక తప్పదు!