7400ఎంఏహెచ్​ బ్యాటరీతో OnePlus 15R.. ఇండియా లాంచ్​ డేట్​ ఇదే..

వన్‌ప్లస్ 15ఆర్ స్మార్ట్​ఫోన్​పై కీలక వివరాలు విడుదలయ్యాయి. ఈ గ్యాడ్జెట్​ 7400ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 8, 2025, 06:00:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ డిసెంబర్ 17న లాంచ్​కానుంది. దాని పేరు వన్​ప్లస్​ 15ఆర్​. తాజాగా ఈ గ్యాడ్జెట్​ గురించి మరికొన్ని ముఖ్యమైన వివరాలను సంస్థ వెల్లడించింది. బ్యాటరీ, డిస్‌ప్లే, వీడియో రికార్డింగ్ సామర్థ్యాలలో కీలకమైన అప్‌గ్రేడ్‌లను ఈ ఫోన్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. గతంలో తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లను ‘ఆర్’ సిరీస్‌లో భాగంగా తీసుకురావడం ద్వారా, ఈ మోడల్ ఒక పెద్ద ముందడుగు వేయనుందని వన్‌ప్లస్ పేర్కొంది.

వన్​ప్లస్​ 15ఆర్​.. (OnePlus)
వన్​ప్లస్​ 15ఆర్​.. (OnePlus)

వన్‌ప్లస్ 15ఆర్: బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు (అఫీషియల్​)..

బ్యాటరీ సామర్థ్యం: వన్‌ప్లస్ 15ఆర్‌లో 7400ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఇది వన్‌ప్లస్ 15లో ఉన్న 7300ఎంఏహెచ్​ బ్యాటరీ కంటే కొద్దిగా పెద్దది. ఈ స్మార్ట్​ఫోన్​ 80డబ్ల్యూ SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ బ్యాటరీని దీర్ఘకాలిక వినియోగానికి అనుగుణంగా తయారుచేశామని, ప్రతిరోజూ ఛార్జింగ్ చేసినప్పటికీ, నాలుగు సంవత్సరాల తర్వాత కూడా కనీసం 80 శాతం సామర్థ్యాన్ని ఇది నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది!

బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడానికి, శక్తి సాంద్రతను పెంచడానికి అనోడ్​లోకి సిలికాన్‌ను జోడించే సిలికాన్ నానోస్టాక్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు.

చైనాలో విడుదలైన వన్‌ప్లస్ ఏస్ 6టీ 8300ఎంఏహెచ్​ బ్యాటరీతో, 100డబ్ల్యూ ఛార్జింగ్‌తో లాంచ్​ అవ్వగా.. గ్లోబల్ వేరియంట్‌లో బ్యాటరీ పరిమాణం తగ్గుతుందని వచ్చిన నివేదికలను ఈ ప్రకటన ద్వారా కంపెనీ ధృవీకరించింది.

వన్‌ప్లస్ 15ఆర్: కీలక ఫీచర్లు (అంచనా)

వన్‌ప్లస్ 15ఆర్ స్మార్ట్​ఫోన్​ 165హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5కే అమోఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని పీక్​ బ్రైట్​నెస్​ 1,800 నిట్స్ వరకు ఉంటుంది. డిఫాల్ట్‌గా 2 నిట్స్ వరకు, లేదా 'రెడ్యూస్ వైట్ పాయింట్' ఫీచర్ ద్వారా 1 నిట్ వరకు కాంతిని తగ్గించుకోవచ్చు.

ఈ స్క్రీన్ టీయూవీ రైన్‌ల్యాండ్ ఇంటెలిజెంట్ ఐ కేర్ 5.0 ని కలిగి ఉంది. అంటే, ఎక్కువసేపు చూసినా కళ్లకు స్ట్రైన్​ తగ్గేలా దీన్ని రూపొందించారు.

వన్‌ప్లస్ 15ఆర్‌లో 4కే వీడియోను 120ఎఫ్​పీఎస్​ వద్ద రికార్డ్ చేయవచ్చని వన్‌ప్లస్ ధృవీకరించింది. ఈ ఫీచర్ ఇంతకుముందు కేవలం వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్‌కు మాత్రమే పరిమితమైంది.

కెమెరా స్పెసిఫికేషన్లను పూర్తిస్థాయిలో ప్రకటించనప్పటికీ, ఇది డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని, అయితే వన్‌ప్లస్ 13ఆర్‌లో ఉన్న టెలిఫొటో లెన్స్ మాత్రం ఇందులో ఉండదని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త డివైజ్ ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ ఫోన్‌లలో కనిపించిన ప్లస్ మైండ్ అనే ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ప్లస్​ కీని ఉపయోగించి, వినియోగదారులు ఆన్-స్క్రీన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్లస్ మైండ్ ఆ సమాచారాన్ని విశ్లేషించి రిమైండర్లు, ఈవెంట్‌లు లేదా వెతకడానికి వీలైన నోట్స్ రూపంలో తయారు చేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More