9000ఎంఏహెచ్ బ్యాటరీతో OnePlus Nord 6- మిడ్ రేంజ్లో అదిరే ఫీచర్లు..
వన్‌ప్లస్ ప్రియులకు అదిరిపోయే వార్త! తన కొత్త 'టర్బో 6' సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమైంది. ఇదే ఫోన్ భారత్‌లో 'వన్‌ప్లస్ నార్డ్ 6' పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
వన్‌ప్లస్ కంపెనీ 2026 ఏడాదిని చాలా బిజీగా ప్రారంభించబోతోంది! జనవరి 8న చైనాలో తన కొత్త 'టర్బో 6' సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. గతాన్ని పరిశీలిస్తే.. చైనాలో లాంచ్ అయిన టర్బో మోడల్స్.. భారత్‌లో ‘వన్ ప్లస్ నార్డ్’ సిరీస్ పేరుతో వస్తుంటాయి. పైగా వీటికి ఇండియాలో మంచి ఆదరణ కూడా ఉంది. త్వరలో రాబోయే 'వన్ ప్లస్ నార్డ్ 6', భారత మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కంపెనీకి పెద్ద ఆయుధం కానుంది.

సాధారణంగా నార్డ్ సిరీస్ జూలై నెలలో వస్తుంటుంది. కానీ, ఈసారి ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను ముందే తీసుకొచ్చిన వన్‌ప్లస్, నార్డ్ 6ను కూడా రాబోయే కొన్ని నెలల్లోనే లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
వన్ ప్లస్ నార్డ్ 6: ఫీచర్లు (అంచనా)
టర్బో సిరీస్‌లో భాగంగా టర్బో 6, టర్బో 6వీ అనే రెండు స్మార్ట్‌ఫోన్స్ రానున్నాయి. వీటిలో టర్బో 6 అత్యంత శక్తివంతమైనదని తెలుస్తోంది.
ప్రాసెసర్: ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ఉండనుంది. ఇదే హార్డ్‌వేర్ భారత్‌లో నార్డ్ 6 పేరుతో వస్తే, గేమింగ్- రోజువారీ పనితీరులో మునుపటి నార్డ్ 5 కంటే చాలా వేగంగా ఉంటుంది.
డిస్‌ప్లే: గేమర్ల కోసం ప్రత్యేకంగా 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 1.5కే రిజల్యూషన్ ప్యానెల్‌ను వన్‌ప్లస్ ఖరారు చేసింది. ఇలాంటి హై-ఎండ్ ఫీచర్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోకి రావడం నిజంగా విశేషం.
బ్యాటరీ: అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. వన్‌ప్లస్ నార్డ్ 6లో ఏకంగా 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండబోతోంది! ఒకవేళ ఇదే బ్యాటరీ ఇండియన్ వేరియంట్‌లోనూ ఉంటే, దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది రికార్డు సృష్టిస్తుంది. దీనికి తోడు 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
డిజైన్ అండ్ రక్షణ: ఈ ఫోన్ చూడటానికి వన్‌ప్లస్ 15 సిరీస్‌ను పోలి ఉంటుంది. ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో రావడం వల్ల నీరు, ధూళి నుంచి గట్టి రక్షణ లభిస్తుంది.
కెమెరా: వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్.. ముందు వైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి.
నార్డ్ సీఈ 6 కూడా రాబోతోందా?
టర్బో 6తో పాటు 'టర్బో 6వీ' కూడా విడుదల కానుంది. ఇది భారత్‌లో 'వన్ ప్లస్ నార్డ్ సీఈ 6'గా వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే ఛాన్స్ ఉంది.
భారత్‌లో ధర ఎంత ఉండొచ్చు?
ధర విషయానికొస్తే.. గతంలో నార్డ్ 4 సుమారు రూ. 30 వేలకు, నార్డ్ 5 సుమారు రూ. 32 వేలకు లాంచ్ అయ్యాయి. ఆ లెక్కన కొత్త 'నార్డ్ 6' స్మార్ట్‌ఫోన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రూ. 35,000 లోపు ఉండే ఛాన్స్ ఉంది. కంపెనీకి చెందిన వన్ ప్లస్ 13ఆర్ ధర రూ. 40 వేల దగ్గర ఉంది కాబట్టి, నార్డ్ 6.. దానికంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 విడుదల తేదీపై సంస్థ ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. కానీ, అంతర్జాతీయ సర్టిఫికేషన్లు పొందిన తీరు చూస్తుంటే, మన దేశంలోకి ఈ ఫోన్ అడుగుపెట్టడానికి ఎంతో కాలం పట్టదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


