ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను నేటితో ముగించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్ ongcapprentices.ongc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా సంస్థలో మొత్తం 2743 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఓఎన్‌జీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025- అర్హతలు, వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు నవంబర్ 6, 2025 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 06.11.2001- 06.11.2007 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో చూడగలరు. ఓఎన్‌జీసీ అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.
ఓఎన్‌జీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025- ఎంపిక ప్రక్రియ
ఓఎన్‌జీసీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
ప్రకటనలో నిర్దేశించిన క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
మెరిట్‌లో ఒకే సంఖ్యలో మార్కులు వచ్చిన సందర్భంలో, ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు లేదా ప్రభావితం చేసే ప్రయత్నాలను అంగీకరించరు. అలాంటి సందర్భాలలో దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చు.
ఓఎన్‌జీసీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన సూచనలను పాటించండి:
స్టెప్ 1- ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్ ongcindia.com ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “ONGC Apprentice Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
{{/usCountry}}స్టెప్ 2- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “ONGC Apprentice Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
{{/usCountry}}స్టెప్ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
స్టెప్ 4- మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి, ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.
స్టెప్ 5- దరఖాస్తు ఫీజు చెల్లించండి (వర్తిస్తే).
స్టెప్ 6- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 7- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు హార్డ్ కాపీని మీ వద్ద భద్రపరుచుకోండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా తనిఖీ చేయండి.