తెలంగాణలో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. వయోపరిమితిలో కీలక మార్పు, అప్లై చేయండి!
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నియామకాలను ప్రారంభించింది. తెలంగాణ యువత దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
ఫిబ్రవరి 13న ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో అగ్నివీర్ పథకంలోని వివిధ కేటగిరీల కింద యువత నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని శాశ్వత నివాసితులందరి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ 10వ తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ 8వ తరగతి పాస్ కేటగిరీల కింద నియామకాలు జరుగుతాయి.

అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అన్ని కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని 21 నుండి 22 సంవత్సరాలకు పెంచారు.
అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ (CEE) తెలుగుతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు. ఐటీఐ, డిప్లొమా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ -అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తుల సమర్పణకు ఆన్‌లైన్ విండో ఏప్రిల్ 1న ముగుస్తుంది. జూన్ 1 నుండి జూన్ 15 వరకు తాత్కాలికంగా షెడ్యూల్ చేసిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం ఏవైనా అప్డేట్స్, అభ్యర్థుల రిజిస్టర్డ్ ఇమెయిల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాన్ని 040-27740059 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఎవరైనా ఉత్తీర్ణత సాధించడానికి లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని చెప్పే దళారీలు, మోసగాళ్ల బారిన పడవద్దని కూడా అభ్యర్థులను అధికారులు హెచ్చరించారు.
నియామక ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, మెరిట్ ఆధారిత, న్యాయమైనదనిగా ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మధ్యవర్తుల పట్ల అభ్యర్థులను అధికారులు హెచ్చరించారు. దరఖాస్తుదారులు అధికారిక కమ్యూనికేషన్‌పై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
రిక్రూటింగ్ ఇయర్ 2027 కోసం అగ్నివీర్‌లోని వివిధ కేటగిరీల కింద పెళ్లికాని యువత నియామకానికి నోటిఫికేషన్ www.joinindianarmy.nic.inలో ప్రచురించారు. ఈ వెబ్‌సైట్‌లో యువత అప్లై చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


