ఒప్పో కంపెనీ తన 'ఏ' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దాని పేరు ఒప్పో ఏ6 ప్రో (Oppo A6 Pro). ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఒప్పో ఏ6 ప్రో: 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, 40 రోజుల స్టాండ్‌బై!

ఈ ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యతనిచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 రోజుల పాటు స్టాండ్‌బై సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని 80డబ్ల్యూ సూపర్ ఊక్ ఛార్జర్‌తో కేవలం 64 నిమిషాల్లో ఈ గ్యాడ్జెట్‌ని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
ఒప్పో ఏ6 ప్రో 5జీ- ధర, లభ్యత..
భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది:
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: దీని ధర రూ. 21,999 గా నిర్ణయించారు.
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: దీని ధర రూ. 23,999.
లాంచ్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో ‘అరోరా గోల్డ్’, 'కాపుచినో బ్రౌన్' రంగులలో సేల్‌కి రెడీగా ఉంది.
- మీ వాట్సాప్ సేఫ్‌గా ఉందా? అకౌంట్‌ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్‌ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఒప్పో ఏ6 ప్రో 5జీ- ఫీచర్లు..
ఈ ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్..
{{/usCountry}}ఈ ఒప్పో ఏ6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్..
{{/usCountry}}డిస్‌ప్లే: 6.75-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మెరుగైన గ్రాఫిక్స్ కోసం ARM Mali-G57 MC2 GPUని జత చేశారు.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్-ఓఎస్ 15 పై ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
కెమెరా: ఒప్పో ఏ6 ప్రో 5జీ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఆటోఫోకస్ సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ద్వారా 1080పీ క్వాలిటీతో వీడియోలను షూట్ చేయవచ్చు.
మన్నిక: ఈ ఫోన్‌కు ఐపీ69 రేటింగ్ ఉంది, అంటే ధూళి- నీటి నుంచి దీనికి గరిష్ట రక్షణ లభిస్తుంది.
భద్రత: సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మన్నికైన ఫోన్ కావాలనుకునే వారికి ఒప్పో ఏ6 ప్రో 5జీ ఒక మంచి ఎంపిక.