ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ప్రధానంగా చూసే ఫీచర్స్‌లో బ్యాటరీ బ్యాకప్ ఒకటి! రోజుకు రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు పనిచేసే ఫోన్ల కోసం వినియోగదారులకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒప్పో' స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. చైనా మార్కెట్లో త్వరలోనే లాంచ్ కానున్న తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఒప్పో ఏ7 ప్రొ మ్యాక్స్’ టీజర్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీనే! ఏకంగా 10,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ రాబోతోందని ఒప్పో ధృవీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ పిక్‌ను కూడా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘వీబో’లో పంచుకుంది.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- పవర్‌ఫుల్ బ్యాటరీ.. గట్టి పనితీరు..
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో ఏ7 ప్రొ మ్యాక్స్ ఫోన్‌లో సింగిల్-సెల్ 10,000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ప్రతిరోజూ ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోతుంటుంది. కానీ ఈ ఫోన్ 1,500 సార్లు ఛార్జ్ చేసినప్పటికీ, దీని బ్యాటరీ కెపాసిటీ 80 శాతం కంటే తగ్గదని కంపెనీ స్పష్టం చేసింది. అంటే ఏళ్ల తరబడి ఈ బ్యాటరీ మెరుగైన బ్యాకప్ ఇస్తుందన్నమాట.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- ఆకట్టుకునే డిజైన్, ఫస్ట్ లుక్..
టీజర్‌లో కనిపిస్తున్న ఫొటో ప్రకారం.. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ కలర్ ఫినిషింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
బ్యాక్ ప్యానెల్‌పై కొద్దిగా పైకి లేచి ఉన్న రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇందులో ఎడమ వైపు నిలువుగా రెండు పెద్ద కెమెరా రింగ్‌లు, వాటి పక్కనే రెండు చిన్న సర్క్యులర్ కటౌట్‌లు ఉన్నాయి.
కుడి వైపు ప్రత్యేకంగా ఎల్ఈడీ ఫ్లాష్‌ను అమర్చి, దానిపై “పవర్ ఫ్లాష్” అని బ్రాండింగ్ చేశారు. ఫోన్ కుడి వైపు అంచున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉంటాయి.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- ఫీచర్లు (అంచనా)
{{/usCountry}}కుడి వైపు ప్రత్యేకంగా ఎల్ఈడీ ఫ్లాష్‌ను అమర్చి, దానిపై “పవర్ ఫ్లాష్” అని బ్రాండింగ్ చేశారు. ఫోన్ కుడి వైపు అంచున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉంటాయి.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- ఫీచర్లు (అంచనా)
{{/usCountry}}అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, చైనాలోని ఒప్పో ఈ-స్టోర్, జేడీ డ్యాట్ కామ్, పీండ్యోడ్యో వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇక లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో ఉండబోయే కీలక ఫీచర్లు ఇవే:
డిస్‌ప్లే: 1.5K రిజల్యూషన్, 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కూడిన 6.78-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
ప్రొసెసర్, సాఫ్ట్‌వేర్: గీక్‌బెంచ్ ప్రకారం ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రొసెసర్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ర్యామ్, స్టోరేజ్: 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది.
కెమెరా అమరిక: వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు పవర్‌ఫుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చే అవకాశముంది.
ఛార్జింగ్, సైజు: 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ మందం కేవలం 8.47ఎంఎం, బరువు 226 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. అంతేకాకుండా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.