Oppo K15 Pro : ఒప్పో నుంచి 2 కొత్త స్మార్ట్​ఫోన్స్​- ఒకటి 8000ఎంఏహెచ్​ బ్యాటరీతో! ధర, ఇండియా లాంచ్​..

ఒప్పో తన ప్రతిష్టాత్మక 'కే15 ప్రో' సిరీస్‌ను చైనాలో ఇటీవలే లాంచ్ చేసింది. తాజాగా ఈ సిరీస్‌లోని కే15 ప్రో, కే15 ప్రో+ మోడళ్లు 2026 మూడవ త్రైమాసికంలో భారత్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Published on: Apr 4, 2026, 07:30:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త 'కే15 ప్రో' సిరీస్‌ను చైనా మార్కెట్​లో ఈ వారమే ఆవిష్కరించింది. అయితే, ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు ఒక తీపి కబురు అందింది! ప్రముఖ టిప్‌స్టర్ దేవయాన్ రాయ్ (@Gadgetsdata) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒప్పో కే15 ప్రో, ఒప్పో కే15 ప్రో+ మోడళ్లు ఈ ఏడాది మూడొవ త్రైమాసికంలో (క్యూ3 2026) భారత్‌లోకి అడుగుపెట్టనున్నాయి! వివరాల్లోకి వెళితే..

ఒప్పో కే15 ప్రో సిరీస్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?
ఒప్పో కే15 ప్రో సిరీస్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?

ఒప్పో కే15 ప్రో సిరీస్- చైనా స్పెసిఫికేషన్లతోనే భారత్‌లోకి..

ఒప్పో కే15 ప్రో సిరీస్​.. చైనాలో విడుదలైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతోనే భారత్‌లోనూ లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్'. గేమింగ్ లేదా ఇతర భారీ టాస్క్‌లు చేస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. ధర విషయానికి వస్తే, చైనాలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కే15 ప్రో సుమారు రూ. 41,000 (2,999 యువాన్) కాగా, ప్రో+ మోడల్ ధర సుమారు రూ. 47,000 (3,499 యువాన్) గా ఉంది.

Vivo V70 FE : అదిరిన వివో కొత్త స్మార్ట్​ఫోన్​! 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో వీ70 ఎఫ్​ఈ..

ఒప్పో కే15 ప్రో సిరీస్- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..

ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16తో పనిచేస్తుంది:

ఒప్పో కే15 ప్రో+ : ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78- ఇంచ్​ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఇది 165 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్​ చిప్‌సెట్‌తో వస్తుంది.

ఒప్పో కే15 ప్రో : ఇది 6.59- ఇంచ్ డిస్‌ప్లే, 144హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 సూపర్ చిప్‌సెట్ అమర్చారు.

ఒప్పో కే15 ప్రో సిరీస్​- కెమెరా, బ్యాటరీ..

ఫొటోగ్రఫీ కోసం రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాటరీ విషయానికొస్తే, ఒప్పో కే15 ప్రో+ ఏకంగా 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉండి, 100 డబ్ల్యూ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రో మోడల్‌లో 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.

చైనాలో ప్రో+ మోడల్ సైబర్ వింగ్స్, ఆరిజిన్ గ్రే రంగుల్లో లభిస్తుండగా, ప్రో మోడల్ అదనంగా గోల్డెన్ లెజెండ్ వంటి షేడ్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, భారత్ లాంచింగ్‌పై ఒప్పో సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకటన తర్వాత ఈ ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్స్​కి సంబంధించిన ఫీచర్లు, ధర వంటి వివరాలపై క్లారిటీ వస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఒప్పో కే15 ప్రో సిరీస్ ప్రత్యేకత ఏంటి?

ఈ స్మార్ట్​ఫోన్లలో గేమింగ్ సమయంలో వేడిని తగ్గించడానికి ప్రత్యేకంగా 'ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్'ను అమర్చారు.

2. ఈ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎంత?

ఒప్పో కె15 ప్రో+ మోడల్‌లో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, కె15 ప్రో మోడల్‌లో 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

3. ఒప్పో కే15 ప్రో సిరీస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది?

ఈ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘కలర్ ఓఎస్ 16’ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More