దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరుగుతోంది. అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2026కు సంబంధించి ఇప్పటివరకు ఏకంగా 7.3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ శుక్రవారం వెల్లడించారు. పన్ను చట్టాలను సరళతరం చేయడం, ఫేస్‌లెస్ విచారణలను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులకు సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఆదాయపు పన్ను శాఖను కేవలం చట్టాలను అమలు చేసే సంస్థగానే కాకుండా, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఒక సహాయకారిగా చూడాలని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికతను ఉపయోగించుకుని పన్నుల నిర్వహణను మరింత స్మార్ట్‌గా, సమర్థవంతంగా మార్చాలని సూచించారు.
మానవ ప్రమేయాన్ని తగ్గించి, ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఫేస్‌లెస్ పన్ను వ్యవస్థను మరింత విస్తరించడంతో పాటు, నిలకడైన, సులువైన పన్ను విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఐటీఆర్ ఆలస్యమైతే పడే 5 రకాల పెనాల్టీలు ఇవే.. జులై 31 ముందే ఫైల్ చేయండి
వేగంగా పరిష్కారమవుతున్న అప్పీళ్లు, ఫిర్యాదులు!
ఆదాయపు పన్ను శాఖ పనితీరును వివరిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) ఏకంగా 2.24 లక్షల పన్ను అప్పీళ్లను పరిష్కరించినట్లు రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తోంది. దీనికి తోడు పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన దాదాపు 4 లక్షల ఫిర్యాదులను పరిష్కరించి, 95 శాతానికి పైగా డిస్పోజల్ రేటును సాధించినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) గ్రాస్, నెట్ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 4 నుంచి 5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సులభంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం..
{{/usCountry}}ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) గ్రాస్, నెట్ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 4 నుంచి 5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సులభంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం..
{{/usCountry}}భారత పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం’ ఒక అద్భుతమైన సంస్కరణ అని అరవింద్ శ్రీవాస్తవ కొనియాడారు. ఈ భారీ మార్పులో భాగంగా పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను కుదించి, కేవలం 536 సెక్షన్లకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : గడువు ముగిసేలోగా ఐటీఆర్ ఫైల్ చేయండి: పన్ను చెల్లింపుదారులకు నిపుణుల సూచన
దీనివల్ల సాధారణ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారవేత్తలకు చట్టంపై స్పష్టత రావడంతో పాటు నిబంధనల అమలు చాలా సులభతరం అవుతుందని చెప్పారు. పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత, పన్ను చెల్లింపుదారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయని ఆయన వివరించారు.
కాగా.. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్‌కి డెడ్‌లైన్ జులై 31. గడువును పొగించే అవకాశాలు లేకపోవడంతో ప్రజలు ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.