2026కి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల లిస్ట్‌ను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు(యూఎస్) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు దిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది.
పద్మ అవార్డులు
{{^htLoading}} {{/htLoading}}
తెలంగాణకు చెందిన రామ రెడ్డి మామిడి.. పశు పోషణ, పాడి రంగంలో చేసిన విశేష సేవలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. పశు పోషణ, పాడి రంగంలో సహకార సంస్థల ఆధారిత వృద్ధికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. సహ వికాస సంస్థ స్థాపకుడిగా రామ రెడ్డి మామిడి.. సహకార సంస్థలను ఏర్పాటు చేసి చాలా మందికి జీవనోపాధిని మెరుగుపరిచారు. పశుపోషణ, పాడి నిర్వహణ, ఆర్థిక పరిపాలన అంశాల్లో రైతులకు శిక్షణ అందించారు. మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను ప్రోత్సహిస్తూ, దూరదృష్టి కలిగిన వ్యక్తిగా తనదైన ముద్ర వేశారు.
హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త డా.కుమారస్వామి తంగరాజ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. భారతీయ జనాభా జన్యు చరిత్రపై ఆయన మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆఫ్రికా నుంచి జరిగిన మెుట్టమెుదటి మానవ వలసలపై పరిశోధన చేశారు. వీటితోపాటుగా అనేక పరిశోధనలు చేస్తూ.. కీలక విషయాలను తెలిపారు
తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలు..
సినీనటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్- కళలు(ఆంధ్రప్రదేశ్)
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
మాగంటి మురళీ మోహన్ - కళలు(ఆంధ్రప్రదేశ్)
{{/usCountry}}
{{#usCountry}}
మాగంటి మురళీ మోహన్ - కళలు(ఆంధ్రప్రదేశ్)
{{/usCountry}}
కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ - సైన్స్ అండ్ ఇంజినీరింగ్(తెలంగాణ)
పాల్కొండ విజయ్ ఆనంద్‌రెడ్డి - వైద్యం(తెలంగాణ)
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ - కళలు(ఆంధ్రప్రదేశ్)
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ - సైన్స్(తెలంగాణ)
రామారెడ్డి మామిడి - పశుసంవర్థక, పాడి పరిశ్రమ(తెలంగాణ)
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.