టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో సమస్యలున్నా ఈ మ్యాచ్ ఆడామంటే అందుకు కారణం శ్రీలంక అధ్యక్షుడేనని మోసిన్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఉన్న మోసిన్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చేతకానివాడి చేతికి పీసీబీ అప్పగించారని పాక్ మాజీలు రెచ్చిపోతున్నారు.
మోసిన్ నఖ్వీ కామెంట్లు

2026 టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసానాయకే అని మోసిన్ నఖ్వీ చెప్పుకొచ్చాడు. శ్రీలంక అధ్యక్షుడి నుండి పిలుపు వచ్చిన తర్వాతే పాకిస్థాన్ నాయకత్వం ఈ మ్యాచ్ పై ఏకాభిప్రాయానికి వచ్చిందని నఖ్వీ తెలిపాడు. శ్రీలంక అధ్యక్షుడు జోక్యం చేసుకునే వరకు కూడా మ్యాచ్ ఆడే విషయంలో మేం 50-50గానే ఉన్నామని పేర్కొన్నాడు.
మీరో హీరే
‘‘పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి నుంచి మీకు (శ్రీలంక అధ్యక్షుడు) అభినందనలు. వారు ప్రత్యేకంగా మీకు నా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. నిజానికి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో మీరే అసలైన హీరో. ఎందుకంటే మీ వల్ల 2 బిలియన్ల మంది వినోదం పొందారు’’ అని మోసిన్ నఖ్వీ అన్నాడు.
భారత్ తో సమస్య
భారత్ తో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్థాన్ కు సమస్యలు ఉన్నాయని మోసిన్ నఖ్వీ అన్నాడు. కానీ శ్రీలంక అధ్యక్షుడు పిలుపుతో అంతా మారిపోయిందని పేర్కొనడం గమనార్హం.
‘‘భారత్‌తో ఆడే విషయంలో మాకు చాలా సమస్యలున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు పాకిస్థాన్ ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం మారింది. ప్రధానమంత్రి మీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే మనం మ్యాచ్ ఆడుతున్నామని చెప్పారు. ’’ అని మోసిన్ నఖ్వీ పేర్కొన్నాడు.
ట్రోల్స్
{{/usCountry}}‘‘భారత్‌తో ఆడే విషయంలో మాకు చాలా సమస్యలున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు పాకిస్థాన్ ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం మారింది. ప్రధానమంత్రి మీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే మనం మ్యాచ్ ఆడుతున్నామని చెప్పారు. ’’ అని మోసిన్ నఖ్వీ పేర్కొన్నాడు.
ట్రోల్స్
{{/usCountry}}మోసిన్ నఖ్వీ కామెంట్లపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇండియాతో మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక కారణంగానే మ్యాచ్ ఆడామని, ఆ నిందను ఆ దేశంపై తోసేయాలని పాక్ చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మోసిన్ నఖ్వీపై పాక్ మాజీలు గుర్రుగా ఉన్నారు. పాకిస్థాన్ తనంతట తానే దిగివచ్చి ఇండియాతో మ్యాచ్ ఆడిందని చెప్తే పరువు పోతుందని మోసిన్ కవర్ చేస్తున్నాడనే ట్రోల్స్ వస్తున్నాయి.
పాక్ చిత్తు
టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో చిత్తయింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 77 రన్స్ తో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో ఓటమితో పాక్ టీమ్ పై సొంత ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.