...
...
Next Story

Ind vs Pak:ఎలాగో గెలవలేరు-టీవీలు పగలగొట్టడం, ముఖానికి కేక్ రాయడం తప్ప ఏం చేస్తారు? వైరల్ గా పాకిస్థాన్ ఫ్యాన్స్ వీడియోలు

ఇండియా మీద గెలవడం చేత కాదు, ఎప్పుడూ ఓడిపోతారని పాకిస్థాన్ టీమ్ మీద అక్కడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్ లో ఇండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి తట్టుకోలేక కోపంతో టీవీలను పగలగొట్టారు. ఓ యూట్యూబర్ తన సోదరి ముఖానికి కేక్ రాశాడు.

Published on: Feb 16, 2026, 12:27:56 IST
Advertisement

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై మరోసారి ఇండియాకు తిరుగులేదని భారత క్రికెట్ వీరులు చాటారు. టీ20 ప్రపంచకప్ లో ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఇండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా పాక్ సరెండర్ అయిపోయింది. తమ టీమ్ ఆట పట్ల పాకిస్థాన్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. టీవీలు పగలగొడుతున్నారు. సెన్స్ మరిచి ప్రవర్తిస్తున్నారు.

టీవీ పగలగొట్టిన ఫ్యాన్

టీవీ పగలగొడుతున్న పాకిస్థాన్ ఫ్యాన్ (Facebook/WaQar Azam)
టీవీ పగలగొడుతున్న పాకిస్థాన్ ఫ్యాన్ (Facebook/WaQar Azam)

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ను ఇండియా చిత్తుచేసింది. 61 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ ఘోర పరాజయంతో తీవ్ర నిరాశకు గురైన ఒక పాకిస్థానీ అభిమాని తన టీవీ సెట్‌ను పగలగొట్టాడు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలో తన జట్టు ఓటమికి కోపంతో క్రికెట్ బ్యాట్‌తో టీవీని ఓ ఫ్యాన్ పగలగొట్టాడు. ఫేస్ బుక్ లో వఖార్ అజమ్ అనే అకౌంట్లో ఈ వీడియో అప్ లోడ్ చేశాడు.

కోపంతో

‘‘భారత్ మళ్ళీ పాకిస్థాన్‌ను ఓడించింది. నేను కోపంతో నా టీవీని పగలగొట్టాను’’ అని అజమ్ తన ఫేస్‌బుక్ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఖాళీ గదిలో అతను తన టీవీ సెట్‌ను కిందపడేసి బ్యాట్ తో కొట్టాడు. టీవీని చాలాసార్లు అలాగే కొట్టాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

పోరాటం లేకుండా

కనీసం పోరాటం లేకుండా తమ టీమ్.. ఇండియా ముందు తలవంచడంతో పాకిస్థాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ‘‘ఇది ఇప్పుడు ఒక నార్మల్ విషయం అయిపోయింది. మ్యాచ్ లో కనీసం మా టీమ్ పోరాడుతుందని అనుకున్నాం. ఎక్కడో గెలుపు మీద ఆశ ఉండేది. కానీ ఇండియా చేతిలో ఓటమి కామన్ అయిపోయింది. బుమ్రా బౌలింగ్ కు మన దగ్గర ఆన్సర్ లేదు. హార్దిక్ ను ఎదుర్కోలేం. ఎప్పటిలాగే ఇండియా బాగా ఆడింది. ఈ విషయాన్ని మేం ఒప్పుకొంటాం’’ అని ఓ పాకిస్థాన్ ఫ్యాన్ ఏఎన్ఐకి తెలిపాడు.

సిస్టర్ ముఖానికి కేక్

8-1

ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్ ల్లో ఇండియా, పాకిస్థాన్ 9 మ్యాచ్ లు ఆడాయి. ఇండియా 8 సార్లు గెలిచింది. 2021లో మాత్రమే పాక్ విజయం సాధించింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాలతో ఇండియా సూపర్-8కు అర్హత సాధించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks