IND vs WI:ఆడటం చేతగాక ఇండియాపై పాకిస్థానీల ఏడుపు-హెట్మెయర్ నాటౌట్-భారత్ కప్ గెలవదని అమీర్-షోలోనే టీవీ పగలగొట్టిన హోస్ట్

IND vs WI: టీ20 ప్రపంచకప్ లో ఇండియా అద్భుతం చేసింది. 196 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసి సెమీస్ చేరుకుంది. కానీ ఇండియాపై పడి ఏడవడం అలవాటైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి నోరు జారుతున్నారు. ఈ మ్యాచ్ లో హెట్మయర్ నాటౌట్ అని, ఇండియా కప్ గెలవదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

Published on: Mar 2, 2026, 11:52:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ దూసుకెళ్లింది. సూపర్ 8లో వెస్టిండీస్ పై ఘన విజయంతో నాకౌట్ బెర్త్ పట్టేసింది. ఆదివారం (మార్చి 1) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది. అయితే ఇండియాపై పడి ఏడవడం అలవాటైన పాకిస్థానీలు మరోసారి తమ వక్రబుద్ధి చూపిస్తున్నారు.

ఇండియాపై అమీర్ కామెంట్లు
ఇండియాపై అమీర్ కామెంట్లు

ఇండియా వర్సెస్ వెస్టిండీస్

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లో ఇండియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది. ఆ టీమ్ ఇన్నింగ్స్ లో విధ్వంసక బ్యాటర్ హెట్మయర్ వికెట్ వివాదాస్పదంగా మారింది. బుమ్రా బౌలింగ్ లో కీపర్ క్యాచ్ కోసం ఇండియా అప్పీల్ చేసింది.

అంపైర్ క్రిస్ గఫానీ ఔటిచ్చాడు. కానీ బ్యాట్ కు బాల్ తాకలేదని భావించిన హెట్మయర్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ లో కూడా అది క్యాచ్ అని తేలింది. కానీ హెట్మయర్ మాత్రం దాన్ని నమ్మలేనట్లు పెవిలియన్ చేరిపోయాడు.

మహమ్మద్ అమీర్ కామెంట్లు

హెట్మయర్ వికెట్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ షో 'హర్నా మానా హై'లో అతను మాట్లాడుతూ.. "హెట్మెయర్ ఔట్ కాంట్రవర్సీకి దారితీసింది. అతను ఔట్ కాదని నేను నమ్ముతున్నా. అతను ఇంకాసేపు క్రీజులో ఉంటే వెస్టిండీస్ స్కోరు 220-230కి చేరేది. అప్పుడు ఇండియా గెలిచేది కాదు. టోర్నీ నుంచి నిష్క్రమించేది’’ అని అమీర్ అన్నాడు.

కప్ గెలవలేదు

హెట్మయర్ ఔట్ తోనే ఆగకుండా ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా కప్ గెలవలేదని మహమ్మద్ అమీర్ మరోసారి విషం కక్కాడు.

‘‘భారత్ మంచి క్రికెట్ ఆడటం లేదు. వాళ్ల ఫీల్డింగ్ బాలేదు. మూణ్నాలుగు క్యాచ్ లు వదిలేశారు. బుమ్రా మినహా ప్రతి బౌలర్ ఫెయిల్ అవుతున్నాడు. హార్దిక్ పాండ్య పెద్ద టీమ్స్ పై ఎప్పుడూ ఆడలేడని నేను ముందే చెప్పా. వరుణ్ చక్రవర్తి కూడా తేలిపోతున్నాడు. ఇండియా హాట్ ఫేవరెట్ కాదు. కప్ గెలవలేదు’’ అని అమీర్ అన్నాడు.

ఇప్పటికే ట్రోల్స్

టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీస్ చేరలేదని గతంలో చెప్పిన మహమ్మద్ అమీర్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. పాకిస్థాన్ కు ఆట చేతగాక సూపర్ 8లోనే నిష్క్రమించిందని ఇండియన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. బాబా అమీర్ ఎక్కడా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడేమో భారత్ కప్ గెలవదని అమీర్ అంటున్నాడు.

లైవ్ షోలో

మరోవైపు ఓ లైవ్ క్రికెట్ విశ్లేషణ షోలో పాకిస్థానీ హోస్ట్ చేసిన పని వైరల్ గా మారింది. వెస్టిండీస్ పై ఇండియా విజయాన్ని తట్టుకోలేని అతను లైవ్ లోనే టీవీ పగలగొట్టాడు. ఈ వీడియోపై కూడా ఇండియన్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

తరచూ అడిగే ప్రశ్నలు

1. ఇండియా ఎన్నిసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచింది?

ఇండియా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2007లో ధోని కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది.

2. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ నెలకొల్పిన సరికొత్త రికార్డు ఏమిటి?

వెస్టిండీస్‌పై 97 (నాటౌట్) పరుగులు చేయడం ద్వారా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా సంజూ శాంసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ (82* పరుగులు) పేరిట ఉండేది.

3. సెమీఫైనల్లో భారత్ ఎవరితో తలపడుతుంది?

సూపర్-8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో భారత్ సెమీఫైనల్ చేరింది. సెమీస్ లో మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More