...
...
Next Story

టీ20 ప్రపంచ‌క‌ప్‌లో పాక్‌.. ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్‌.. ఎలాగో ఓడిపోతారు క‌దా అంటూ ఫ్యాన్స్ సెటైర్లు

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడనుంది. కానీ ఇండియాతో మ్యాచ్ ను మాత్రం బహిష్కరిస్తుంది. ఈ విషయాన్ని ఆదివారం పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎలాగో ఓడిపోయే మ్యాచ్ కదా అని ఇండియా ఫ్యాన్స్ పాక్ పై సెటైర్లు వేస్తున్నారు.

Published on: Feb 1, 2026, 21:28:47 IST
Advertisement

ఇదేం నిర్ణయం.. టీ20 ప్రపంచకప్ లో ఆడతాం, కానీ ఇండియాతో మ్యాచ్ మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ టీమ్ తీసుకున్న నిర్ణయంపై వస్తున్న సెటైర్లు ఇవే. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడటం ఖాయమైంది. కానీ ఇండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించడం అర్థం లేని నిర్ణయంగా విమర్శలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ లో పాక్

పాకిస్థాన్, ఇండియా కెప్టెన్లు (AFP)
పాకిస్థాన్, ఇండియా కెప్టెన్లు (AFP)

భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 1) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది.

ఇండియాతో మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ లో ఆడతామని ప్రకటించిన పాక్.. ఈ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ కోసం మైదానంలో దిగబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ను పాక్ బహిష్కరిస్తుంది. దీనికి గల కారణాలను మాత్రం పాక్ వెల్లడించలేదు. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ ప్రభుత్వం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆడేందుకు అనుమతినిచ్చింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో తలపడాల్సిన మ్యాచ్ లో మాత్రం మైదానంలోకి దిగదు’’ అని ఎక్స్ లో పాకిస్థాన్ ప్రభుత్వం పోస్టు చేసింది. అయితే సెమీస్, ఫైనల్లో ఇండియాతో ఆడాల్సి వస్తే ఏం చేస్తారనే నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు.

పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటన

అదే కారణమా?

ఈ విషయంలో బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా పాకిస్థాన్ నిలుస్తోంది. అందుకే టీ20 ప్రపంచకప్ నే మొత్తం బాయ్ కాట్ చేయాలనే ఆలోచన కూడా చేసింది. కానీ ఇప్పుడు కేవలం ఇండియా మ్యాచ్ మాత్రమే ఆడమని చెప్పింది.

ఎలాగో ఓడిపోయే మ్యాచ్

టీ20 ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలు మజా ఉండదు. ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఇటీవల టీమిండియా డామినెన్స్ కారణంగా ఆ కిక్కు ఉండటం లేదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో పాకిస్థాన్ ఆడకపోయినా పోయేదం లేదని, ఎలాగో ఓడిపోయే మ్యాచ్ కాబట్టి బాయ్ కాట్ అంటూ తప్పించుకుందని ఇండియన్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks