...
...
Next Story

పే డే లోన్స్ అంటే ఏమిటి? వడ్డీ, అర్హతలు, రిస్కుల పూర్తి వివరాలు ఇవిగో

నెల ఆఖరులో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఆదుకునే పేడే లోన్స్ (Payday Loans) గురించి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు. వీటి అర్హతలు, కావలసిన పత్రాలు, అధిక వడ్డీ భారం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక కథనం.

Published on: Oct 4, 2026, 16:18:17 IST
Advertisement

నెల చివరిలో అకస్మాత్తుగా నగదు కొరత ఏర్పడినా, అత్యవసర వైద్య లేదా ఇతర ఖర్చులు ముంచుకొచ్చినా చాలామంది ఆలోచించే మార్గం 'పేడే లోన్'. ఇవి స్వల్పకాలిక, అన్‌సెక్యూర్డ్ రుణాలు. ఒక జీతం పడిన రోజు నుంచి తదుపరి జీతం వచ్చే వరకు అయ్యే అత్యవసర ఖర్చుల కోసం వీటిని అందిస్తుంటారు. సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజులలోపు లేదా తదుపరి జీతం రాగానే ఈ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాల కోసం ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తుల వంటి ఎలాంటి భౌతిక గ్యారంటీ (కొలేటరల్) సమర్పించాల్సిన అవసరం లేదు.

భారత్‌లో పేడే లోన్స్ చట్టబద్ధమేనా?

పే డే లోన్స్ అంటే ఏమిటి? వడ్డీ, అర్హతలు, రిస్కుల పూర్తి వివరాలు ఇవిగో
పే డే లోన్స్ అంటే ఏమిటి? వడ్డీ, అర్హతలు, రిస్కుల పూర్తి వివరాలు ఇవిగో

భారతదేశంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌‌బీఎఫ్‌సీలు) లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే పేడే రుణాలను అందించేందుకు అనుమతి ఉంది. నేరుగా లేదా అధికారిక లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ల (ఎల్ఎస్‌పీ) ద్వారా ఈ రుణాలు ఇస్తుంటారు. డిజిటల్ రుణాల మంజూరు, వడ్డీ రేట్ల వెల్లడి, వసూళ్ల ప్రక్రియపై ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ, 'పేడే లోన్' అనే కేటగిరీకి ప్రత్యేకంగా వర్గీకృత నిబంధనలేవీ రూపకల్పన చేయలేదు.

పేడే లోన్ ప్రక్రియ ఎలా సాగుతుంది?

బ్యాంకు శాఖలు లేదా డిజిటల్ పోర్టళ్ల ద్వారా పేడే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయ వివరాలు, ఉద్యోగ ఆధారాలు సరిగ్గా ఉంటే చాలా వేగంగా దరఖాస్తు ఆమోదం పొందుతుంది. రుణ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. తదుపరి జీతం పడగానే అసలు, వడ్డీ, ఇతర రుసుములను ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటారు.

సాధారణ వ్యక్తిగత రుణాల తరహాలో వీటికి సంప్రదాయ క్రెడిట్ స్కోర్ పరిశీలన ఉండకపోవచ్చు. ఉద్యోగ స్థిరత్వం, నెలవారీ జీతం ఆధారంగానే రుణం మంజూరు చేస్తారు. సాధారణంగా నికర నెలవారీ జీతంలో 30 శాతం నుంచి 60 శాతం వరకు రుణంగా ఇస్తారు. ఉదాహరణకు కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ జీతాల ఖాతాదారులకు నికర వేతనంలో 50 శాతం వరకు ఒక నెలకు పేడే రుణం అందిస్తోంది.

అర్హతలు, కావలసిన పత్రాలు

పేడే లోన్లలో ప్రధానమైన లోపం అధిక వడ్డీ రేట్లు. సాధారణ వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డులతో పోలిస్తే వీటిపై వడ్డీ భారం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంస్థల్లో ఏటా వడ్డీ రేట్లు 40 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు కొన్ని పారదర్శకంగా లేని అదనపు రుసుములు కూడా తోడయ్యే ప్రమాదం ఉంది.

సమయానికి రుణం చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. తద్వారా భవిష్యత్తులో ఇతర రుణాలు పొందడం కష్టమవుతుంది. ఒక రుణం తీర్చడానికి మరో రుణం తీసుకోవాల్సి వచ్చి దరఖాస్తుదారులు అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రుణం తీసుకునే ముందే నియమ నిబంధనలు, పూర్తి వ్యయాన్ని సరిచూసుకోవడం శ్రేయస్కరం.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks