పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB) సంయుక్తంగా ఒక నూతన క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. భారతదేశంలోనే తొలిసారిగా కుటుంబ సమేతంగా ఎయిర్పోర్ట్ లాంజ్ సదుపాయాన్ని పొందే వెసులుబాటుతో 'పేటీఎం ఏయూ ఎస్ఎఫ్బీ క్రెడిట్ కార్డ్' (Paytm AU SFB Credit Card) పేరుతో ఈ రూపే (RuPay) కార్డ్‌ను బుధవారం ముంబైలో విడుదల చేశాయి.

డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిపే నేటితరం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ (ఎలాంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము లేని) కార్డ్‌ను రూపొందించినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్డ్ ప్రత్యేకతలు, ఆఫర్లు ఇవే
రివార్డు పాయింట్లు: పేటీఎం యూపీఐ ద్వారా జరిపే నిత్య జీవిత ఖర్చులు, కిరాణా సామాగ్రి కొనుగోళ్లు, క్యాబ్ బుకింగ్స్ వంటి అర్హత కలిగిన లావాదేవీలపై 2 శాతం వరకు రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ట్రావెల్, గోల్డ్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్: పేటీఎం యాప్ ద్వారా చేసే ట్రావెల్ బుకింగ్స్, పేటీఎం గోల్డ్ (డిజిటల్ బంగారం) కొనుగోళ్లపై ఏకంగా 5 శాతం రివార్డులు సొంతం చేసుకోవచ్చు.
రివార్డుల వినియోగం: ఒక రివార్డు పాయింట్ విలువ ఒక రూపాయికి సమానం. ఈ పాయింట్లను పేటీఎం గోల్డ్ కొనుగోలుకు, వివిధ రకాల గిఫ్ట్ వోచర్లు పొందడానికి లేదా బిల్లుల చెల్లింపులకు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
కుటుంబ సమేతంగా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్
ఈ క్రెడిట్ కార్డ్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్'. పేటీఎం యాప్ ద్వారా రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు, ఒకేసారి నలుగురు కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ లాంజ్ సదుపాయాన్ని పొందవచ్చు.
సంవత్సరానికి గరిష్ఠంగా 12 ఉచిత లాంజ్ సందర్శనలు లభిస్తాయి. ఫిజికల్ కార్డ్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, యాప్‌లోని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా చాలా సులభంగా లాంజ్ ప్రవేశం పొందవచ్చని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
- ముందుగా మీ మొబైల్లోని పేటీఎం (Paytm) యాప్‌ను ఓపెన్ చేసి 'Credit Card' అని సెర్చ్ చేయాలి.
- అనంతరం స్క్రీన్‌పై కనిపించే 'Get Credit Card' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో 'Paytm AU SFB Credit Card'ను ఎంచుకోవాలి.
- 'Apply Now'పై క్లిక్ చేసి, మీ వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను నమోదు చేయాలి.
- వీడియో కేవైసీ (KYC) ప్రక్రియ మరియు ధృవీకరణ పూర్తి చేయాలి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత, దాని పురోగతిని (Status) పేటీఎం యాప్‌లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

యూపీఐ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి, మొబైల్ ఆధారిత లావాదేవీలు ఎక్కువగా చేసే వినియోగదారులకు మరింత చేరువ కావడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఇటీవల సార్వత్రిక బ్యాంకుగా (Universal Bank) మారేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రాథమిక అనుమతి పొందిన సంస్థగా ఏయూ బ్యాంక్ నిలిచిన విషయం విదితమే.