Tata EV discounts : 'పెట్రో' మంట! ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ఈ టాటా ఈవీలపై భారీ ఆఫర్లు..
Electric Car Discounts India : టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) శ్రేణిపై మే 2026 నెలకు గాను భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, హారియర్ ఈవీ, టియాగో ఈవీ మోడళ్లపై రూ. 3.8 లక్షల వరకు కస్టమర్లు ప్రయోజనాలను పొందవచ్చు. పూర్తి వివరాలు..
Tata Punch EV discounts : పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అనిశ్చితి నెలకొంది. ఇంధన ధరలు ఇప్పటికే రూ. 3 పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ రేట్లు మరింత పెరగొచ్చన్న అంచనాలు ఇప్పుడు వాహనదారులను భయపెడుతున్నాయి. ఈ తరుణంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు స్విఛ్ అవ్వాలని చూస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే!

మీరు ఈవీ కొనడానికి ఇదే సరైన సమయం. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే.. మరోవైపు తమ పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ మోడల్స్‌పై ఈ మే 2026లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది భారత దేశ ఈవీ రారాజు టాటా మోటార్స్. టాటా పంచ్ ఈవీ నుంచి హారియర్ ఈవీ వరకు క్రేజీ డిస్కౌంట్లను అందిస్తోంది. వాటి గురించి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టాటా కర్వ్ ఈవీ..
ఈ మే నెల డిస్కౌంట్ ఆఫర్లలో టాటా కర్వ్ ఈవీ అన్నింటికంటే ముందు వరుసలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారుపై అత్యధికంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. 2024, 2025 మోడల్ ఇయర్ (ఎంవై24/ ఎంవై25) క్రియేటివ్ 45 వేరియంట్లపై రూ. 3.3 లక్షల వరకు, ఇతర టాప్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇక లేటెస్ట్ 2026 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ. 3.3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.
టాటా హారియర్ ఈవీ..
టాటా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ (ఎంవై25, ఎంవై26 మోడళ్ల) పై రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి గ్రీన్ బోనస్ లేనప్పటికీ.. కస్టమర్లు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 75,000 స్క్రాపేజ్ బెనిఫిట్ పొందవచ్చు. దీనికి తోడు పాత ఈవీ కస్టమర్లకు రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, సాధారణ పెట్రోల్/డీజిల్ కార్ల నుంచి అప్‌గ్రేడ్ అయ్యే వారికి రూ. 50,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. అలాగే అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఇంటర్వెన్షన్ బోనస్ కూడా వర్తిస్తుంది.
టాటా టియాగో ఈవీ..
టాటా లైనప్‌లోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా పేరుగాంచిన టియాగో ఈవీపై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. 2024, 2025 మోడల్ టియాగో ఈవీ ఎల్ఆర్ ఎక్స్‌జెడ్+ (టెక్ లక్స్‌తో కలిపి) వేరియంట్లపై రూ. 2.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్ఆర్ ఎక్స్‌టీ వేరియంట్లపై రూ. 1.8 లక్షల వరకు, ఎంఆర్ వేరియంట్లపై రూ. 1.5 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ. 60,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.
టాటా పంచ్ ఈవీ..
మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీ 2024, 2025 లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ. 2.1 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మిడ్-రేంజ్ వేరియంట్లపై రూ. 1.9 లక్షల వరకు, బేస్ స్మార్ట్ ట్రిమ్‌పై రూ. 1.6 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక 2026 మోడల్ లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ. 1.4 లక్షల వరకు, మిడ్-రేంజ్ వేరియంట్లపై రూ. 1.2 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ..
టాటా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీపై రూ. 1.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది 2024, 2025 మోడళ్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 20,000 గ్రీన్ బోనస్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (లేదా రూ. 55,000 స్క్రాపేజ్ బెనిఫిట్), అలాగే రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ కలిసి ఉన్నాయి. అయితే సరికొత్త 2026 నెక్సాన్ ఈవీ మోడళ్లపై మాత్రం అన్ని వేరియంట్లకు గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే డిస్కౌంట్ పరిమితం చేశారు.
కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి, ముఖ్యంగా టాటా బ్రాండ్ ప్రియులకు ఈ మే నెల ఆఫర్లు ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


