ఎడ్‌టెక్ దిగ్గజం ఫిజిక్స్‌వాలా (PW) షేర్లు గురువారం స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలతో దూసుకెళ్లాయి. 2029–30 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక వృద్ధి అంచనాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఫిజిక్స్‌వాలా షేర్ ధర దాదాపు 6.55 శాతం మేర ర్యాలీ జరిపింది.

జేఈఈ, నీట్ సహా పలు పోటీ పరీక్షలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణ అందిస్తూ నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, రాబోయే మూడేళ్లలో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ వార్షిక సగటు ఆదాయ వృద్ధిని (సీఏజీఆర్) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల్లో మొదలైన ఈ స్టాక్, ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ 6.5 శాతం పైకి ఎగబాకింది.
మోతీలాల్ ఓస్వాల్ 'బై' రేటింగ్.. 56% వృద్ధి అంచనా
ఫిజిక్స్‌వాలా ప్రకటించిన వృద్ధి లక్ష్యాలపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) సానుకూల నివేదిక ఇచ్చింది. ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించని భారీ విద్యా మార్కెట్, ఇప్పటికే బలంగా ఉన్న ఆన్‌లైన్ పంపిణీ వ్యవస్థ, మెరుగుపడుతున్న నిర్వహణ సామర్థ్యం (ఆపరేటింగ్ లివరేజ్) ఈ సంస్థ లక్ష్యాలకు ప్రధాన బలమని ఎంఓఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఈ స్టాక్ విలువ ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 56 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే ఈ లక్ష్యాల సాధన సంస్థ అమలు తీరుపై ఆధారపడి ఉంటుందని బ్రోకరేజీ సంస్థ స్పష్టం చేసింది. 25 శాతానికి పైగా వృద్ధిని నిలకడగా కొనసాగించడం, కేవలం ప్రధాన పోటీ పరీక్షల శిక్షణకే పరిమితం కాకుండా ఇతర విభాగాలకు విస్తరించడం, కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం, ఆఫ్‌లైన్ కేంద్రాల నుంచి రాబడులను మెరుగుపరుచుకోవడం కీలకమని నివేదికలో ప్రస్తావించింది.
"2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఫిజిక్స్‌వాలా రూ. 20.8 బిలియన్ల (రూ. 2,080 కోట్లు) ఏకీకృత ప్రీ-ఐఎన్డీ ఏఎస్ ఈబీఐటీడీఏను సాధిస్తుందని మేము అంచనా వేస్తున్నాం. దీని ప్రకారం ఎఫ్వై30 అంచనా ఈవీ/ఈబీఐటీడీఏ నిష్పత్తి సుమారు 20 రెట్లుగా ఉంటుంది" అని గురువారం విడుదల చేసిన నివేదికలో ఎంఓఎఫ్ఎస్ఎల్ పేర్కొంది.
షేర్ టార్గెట్ ధర రూ. 200
{{/usCountry}}"2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఫిజిక్స్‌వాలా రూ. 20.8 బిలియన్ల (రూ. 2,080 కోట్లు) ఏకీకృత ప్రీ-ఐఎన్డీ ఏఎస్ ఈబీఐటీడీఏను సాధిస్తుందని మేము అంచనా వేస్తున్నాం. దీని ప్రకారం ఎఫ్వై30 అంచనా ఈవీ/ఈబీఐటీడీఏ నిష్పత్తి సుమారు 20 రెట్లుగా ఉంటుంది" అని గురువారం విడుదల చేసిన నివేదికలో ఎంఓఎఫ్ఎస్ఎల్ పేర్కొంది.
షేర్ టార్గెట్ ధర రూ. 200
{{/usCountry}}ఫిజిక్స్‌వాలా స్టాక్‌పై 'బై' రేటింగ్‌ను కొనసాగిస్తున్న మోతీలాల్ ఓస్వాల్, ఒక్కో షేర్‌కు రూ. 200 టార్గెట్ ధరను నిర్ణయించింది. సంస్థ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విభాగాల విలువను వేర్వేరుగా లెక్కించి ఈ అంచనాకు వచ్చింది.
"ఎస్ఓటీపీ పద్ధతిలో ఫిజిక్స్‌వాలా విలువను లెక్కించాం. ఆన్‌లైన్ వ్యాపారానికి 2028 ఆర్థిక సంవత్సర అంచనా ఈవీ/ఈబీఐటీడీఏలో 50 రెట్లు, ఆఫ్‌లైన్ వ్యాపారానికి 15 రెట్లు విలువ కడుతూ షేర్ టార్గెట్ ధరను రూ. 200గా నిర్ణయించాం. ఈ షేర్‌పై 'బై' రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం" అని బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది.
2030 నాటికి రూ. 10,000 కోట్ల ఆదాయ లక్ష్యం
ఆన్‌లైన్-ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌గా ఎదగాలన్న తమ ప్రణాళికను ఫిజిక్స్‌వాలా యాజమాన్యం వివరించింది. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 90 బిలియన్ల నుంచి రూ. 100 బిలియన్ల (రూ. 9,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ అంచనాల ప్రకారం 2027–30 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏకీకృత ఆదాయం కనీసం 25 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుంది.
2030 ఆర్థిక సంవత్సరం నాటికి 20 శాతానికి పైగా ఈబీఐటీడీఏ మార్జిన్ సాధించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వాటాలు సుమారు 52:48 నిష్పత్తిలో ఉన్నాయి. 2030 నాటికి మొత్తం ఆదాయంలో ఆన్‌లైన్ విభాగం వాటా దాదాపు మూడింట రెండొంతులకు పెరుగుతుందని, మిగిలిన మూడింట ఒక వంతు ఆఫ్‌లైన్ ద్వారా వస్తుందని యాజమాన్యం అంచనా వేస్తోంది.
బీఎస్ఈలో షేర్ ట్రెండ్ ఇలా..
గురువారం (నవంబర్ 19) మధ్యాహ్నం 3:18 గంటల సమయానికి బీఎస్ఈలో ఫిజిక్స్‌వాలా షేర్ 6.40 శాతం లాభంతో రూ. 134.40 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ. 39,674.30 కోట్లుగా నమోదైంది. గత కొంతకాలంగా ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తోంది. గడిచిన వారంలో 5.98 శాతం, రెండు వారాల్లో 2.98 శాతం, మూడు నెలల్లో 11.72 శాతం, ఆరు నెలల కాలంలో సుమారు 20.29 శాతం మేర ఫిజిక్స్‌వాలా షేర్ విలువ పెరిగింది.
(గమనిక: ఈ కథనంలో తెలిపిన అభిప్రాయాలు, వ్యూహాలు, సిఫారసులు సంబంధిత బ్రోకరేజీ కంపెనీవి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సెబీ సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించగలరు.)