సంక్రాంతికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ టాటా ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్..
ఈ సంక్రాంతికి కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే వార్త చెప్పింది. హారియర్, సఫారీ, నెక్సాన్ వంటి పాపులర్ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ. 85,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ సంక్రాంతికి సొంత కారును ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! జనవరి నెలకు సంబంధించిన తమ పోర్ట్‌ఫోలియోలోని అనేక వాహనాలపై టాటా మోటార్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. హారియర్, సఫారీ, నెక్సాన్, పంచ్, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్, కర్వ్ వంటి మోడళ్లపై ఇప్పుడు ఆకర్షణీయమైన బెనిఫిట్స్ లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్/స్క్రాప్పేజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్ రూపంలో కస్టమర్లు భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టాటా కార్లు, వాటిపై ఆఫర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా హారియర్, సఫారీ: రూ. 75,000 వరకు తగ్గింపు..
టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీ (ఎంవై2025) డీజిల్ వేరియంట్లపై జనవరిలో రూ. 75,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 25,000 డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ కాగా, పాత కారును మార్చుకునే వారికి రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాప్పేజ్ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రస్తుతం హారియర్ ధర రూ. 12.89 లక్షల నుంచి రూ. 25.25 లక్షల మధ్య ఉండగా, సఫారీ ధర రూ. 13.29 లక్షల నుంచి రూ. 25.96 లక్షల వరకు ఉంది.
ఇటీవల ఈ రెండింటిలోనూ పెట్రోల్ వేరియంట్లను కూడా టాటా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
టాటా పంచ్: ఫేస్‌లిఫ్ట్ రాకముందే అదిరిపోయే డీల్స్..
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న టాటా పంచ్ కొనేవారికి రూ. 40,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. జనవరి 13న పంచ్ ఫేస్‌లిఫ్ట్ (కొత్త మోడల్) విడుదల కానున్న నేపథ్యంలో, ప్రస్తుత మోడల్‌పై టాటా మోటార్స్ ఈ డిస్కౌంట్లను ఇస్తోంది.
కొత్త మోడల్‌లో డిజైన్ మార్పులతో పాటు మరిన్ని ఫీచర్లు రానున్నాయి. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా ఆల్ట్రోజ్: అత్యధికంగా రూ. 85,000 తగ్గింపు..
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌పై టాటా భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది లాంచ్ అయిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు ఉండగా, పాత స్టాక్ క్లియర్ చేయడానికి ఏకంగా రూ. 85,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
ఆల్ట్రోజ్ ధరలు రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
టాటా నెక్సాన్: రూ. 50,000 వరకు ఆదా..
యూత్ ఫేవరెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌పై ఈ నెలలో రూ. 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 20,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లకు కూడా వర్తిస్తాయి.
నెక్సాన్ ధరలు రూ. 7.32 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.15 లక్షల వరకు ఉన్నాయి.
టియాగో, టిగోర్, కర్వ్‌పై డిస్కౌంట్లు ఇలా..
చిన్న కార్లయిన టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్‌లపై రూ. 35,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. అయితే టియాగో బేస్ వేరియంట్ (ఎక్స్ఈ)పై ఇవి వర్తించవు. స్టైలిష్‌గా ఉండే కర్వ్ కూపే ఎస్‌యూవీపై ఈ నెలలో రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, మరో రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.
టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ఆఫర్లు కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మంచి అవకాశమని చెప్పవచ్చు.
* ఈ తగ్గింపులు నగరాన్ని బట్టి మారుతుంటాయి. అలాగే స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని టాటా డీలర్‌ను సంప్రదించగలరు.
* పైన చెప్పిన వాహనాల ధరలు ఎక్స్‌షోరూం ప్రైజ్లని గుర్తుపెట్టుకోవాలి.
*పైన ఆఫర్లు జనవరి నెలకు సంబంధించినవి మాత్రమే.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


