మరింత స్టైలిష్​గా 2026 టాటా పంచ్​- మూడు రోజుల్లో ఫేస్​లిఫ్ట్​ లాంచ్​..

టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'పంచ్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరి 13న విడుదల చేయనుంది. కొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jan 10, 2026, 05:36:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన 'టాటా పంచ్' ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. జనవరి 13న భారత మార్కెట్​లో టాటా పంచ్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్ మార్పులు, వేరియంట్లు, కలర్ ఆప్షన్లపై టాటా మోటార్స్ క్లారిటీ ఇస్తోంది.

మూడు రోజుల్లో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​..
మూడు రోజుల్లో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​..

తాజాగా ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. డీలర్ షోరూమ్‌లలో ప్రదర్శనకు ఉంచిన ఈ ఫోటోలు చూస్తుంటే, పాత మోడల్ కంటే ఇది మరింత స్టైలిష్‌గా ఉంటుందని స్పష్టమవుతోంది.

ముఖ్యంగా షోరూమ్‌లో కనిపిస్తున్నది సిఎన్జీ వేరియంట్ కావడం గమనార్హం.

మరి ఈ కొత్త పంచ్‌లో మారిన అంశాలేంటి? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

డిజైన్‌లో కొత్తదనం.. నెక్షాన్ తరహా లుక్!

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ తన పాత రూపాన్ని కాపాడుకుంటూనే, ముఖభాగంలో భారీ మార్పులు చేసుకుంది. టాటా కొత్త మోడల్స్ అయిన నెక్షాన్, హారియర్, సఫారీ తరహాలోనే ఈ ఎస్​యూవీకి కూడా కొత్త లైటింగ్ ఎలిమెంట్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్, రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త స్కిడ్ ప్లేట్లు ఇచ్చారు. ఇవన్నీ కారుకు ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి.

కారు వెనుక భాగంలో టెయిల్ లైట్ల డిజైన్ మారింది. అవుట్‌లైన్ పాత మోడల్ లాగే ఉన్నా, లోపల గ్రాఫిక్స్ కొత్తగా ఉన్నాయి. రేర్ బంపర్‌ను కూడా కొంచెం రగ్గడ్‌గా మార్చడంతో ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ మరింత ధృడంగా కనిపిస్తోంది.

ఆకర్షణీయమైన కొత్త రంగులతో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​..

ఈసారి రంగుల విషయంలో కూడా టాటా మోటార్స్ వెనక్కి తగ్గలేదు. టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో మొత్తం ఆరు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేస్తోంది. అవి..

సయాంటాఫిక్ బ్లూ

కారామెల్ ఎల్లో

బెంగాల్ రూజ్ రెడ్

డేటోనా గ్రే

కూర్గ్ క్లౌడ్స్ సిల్వర్

ప్రిస్టైన్ వైట్

ఇటీవల డీలర్‌షిప్‌లో కనిపించిన కారు 'కూర్గ్ క్లౌడ్స్ సిల్వర్' రంగులో మెరిసిపోతోంది.

అదిరిపోయే ఫీచర్లు.. మారిన ఇంటీరియర్​!

కేవలం బయటే కాదు, 2026 టాటా పంచ్ ఎస్​యూవీ​ లోపల (ఇంటీరియర్) కూడా చాలా మార్పులు జరిగాయి.

స్టీరింగ్ వీల్: ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన కొత్త ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్.

కంట్రోల్స్: టాగుల్ తరహా స్విచ్‌లు, కొత్త ఏసీ వెంట్స్.

డిస్‌ప్లే: 7-ఇంచ్​ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

భద్రత: ఈసారి సేఫ్టీకి పెద్దపీట వేస్తూ 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను జత చేశారు.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్ సామర్థ్యం..

కొత్త పంచ్‌లో ప్రధాన ఆకర్షణ 'టర్బో-పెట్రోల్' ఇంజిన్. కొత్త ఇంజిన్​తో పంచ్​ లాంచ్​ అవుతుందని సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ యధావిధిగా కొనసాగుతుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఏఎంటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

జనవరి 13న లాంచ్ సందర్భంగా ఈ కారు ధరలు, వేరియంట్ల వారీగా ఫీచర్ల వివరాలను టాటా మోటార్స్ ప్రకటించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More