Best selling cars : కొత్త కారు కొనాలా? ఇండియాలో టాప్-10, బెస్ట్ సెల్లింగ్ ఇవే..
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఉన్న ఆప్షన్స్‌లో ఏది ఎంచుకోవాలో అర్థంకావడం లేదా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో జూన్ 2026కి సంబంధించిన టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. గత నెల (జూన్ 2026) కార్ల అమ్మకాలలో టాటా మోటార్స్‌కు చెందిన మోడళ్లు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముఖ్యంగా 'టాటా పంచ్' ఏకంగా 101 శాతం వార్షిక వృద్ధితో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది.

దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల మోడళ్లు గత నెలలో కలిపి మొత్తం 1,56,014 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. జూన్ 2025లో నమోదైన 1,16,267 యూనిట్లతో పోలిస్తే ఇది 34.19 శాతం అద్భుతమైన వార్షిక వృద్ధిని సూచిస్తోంది. ఈ టాప్ 10 జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన 6 మోడళ్లు ఉండగా, టాటా మోటార్స్ టాప్-2 స్థానాలను దక్కించుకుంది. మహీంద్రా, హ్యుందాయ్ బ్రాండ్లు చెరో స్థానాన్ని సాధించాయి.
టాటా పంచ్ సంచలనం.. నెక్సాన్ సెకండ్!
టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవలే ఐసీఈ (పెట్రోల్), ఎలక్ట్రిక్ (ఈవీ) వెర్షన్లలో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు రావడం ఈ కారుకు భారీగా కలిసి వచ్చింది. జూన్ 2025లో కేవలం 10,446 యూనిట్లు అమ్ముడైన పంచ్.. గత నెలలో ఏకంగా 21,006 యూనిట్ల విక్రయాలతో 101 శాతం కంటే ఎక్కువ గ్రోత్ సాధించింది. మొత్తం టాప్ 10 కార్ల సేల్స్‌లో కేవలం పంచ్ వాటానే 13.46 శాతంగా ఉంది.
మరోవైపు టాటా నెక్సాన్ 18,335 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఇది 58.03 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మారుతీ జోరు.. మహీంద్రా స్కోర్పియో క్రేజ్!
మారుతీ సుజుకీకి చెందిన సెడాన్ కార్ ‘డిజైర్’ 17,899 యూనిట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత వ్యాగన్ఆర్ (16,952), ఎర్టిగా ఎంపీవీ (16,111), సరికొత్త స్విఫ్ట్ (15,215) వరుస స్థానాల్లో నిలిచాయి. మహీంద్రాకు చెందిన స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ మోడళ్లు కలిపి 14,097 యూనిట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మారుతీ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ ‘ఫ్రాంక్స్’, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో'లు వరుసగా 8, 9 స్థానాల్లో నిలవగా.. హ్యుందాయ్ వెన్యూ 10,776 యూనిట్లతో టాప్ 10 లిస్టును పూర్తి చేసింది.
రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న వారాల్లో మరిన్ని కొత్త కార్లు మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. అయితే, విక్రయాల వాల్యూమ్ పరంగా చూస్తే మాత్రం మార్కెట్లో టాటా మోటార్స్, మారుతీ సుజుకీల ఆధిపత్యం ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


