Best SUV : మీ నెక్ట్స్ కారుగా టాటా పంచ్​నే ఎందుకు తీసుకోవాలి? 5 కారణాలు..

Tata Punch : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటిగా దూసుకెళుతున్న టాటా పంచ్​ని మీరు ఎందుకు కొనాలి? ఇందుకు 5 బెస్ట్​ కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 19, 2026, 06:43:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SUVs under 10 lakhs : భారత ఆటోమొబైల్ మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన ‘టాటా పంచ్’ సరికొత్త అవతారంలో ఈ ఏడాది మొదటి నెలలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టాటా మోటార్స్ ఈ మైక్రో ఎస్‌యూవీని మునుపటి కంటే చాలా ప్రీమియంగా, పవర్‌ఫుల్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్​ని కొనే ముందు కస్టమర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూసేయండి..

2026 టాటా పంచ్..
2026 టాటా పంచ్..

2026 టాటా పంచ్- సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్..

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం సరికొత్తగా మారింది. ఇందులో రీపొజిషన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, సరికొత్త లైటింగ్ సిగ్నేచర్స్. మునుపటి కంటే షార్ప్‌గా ఉండే బంపర్ డిజైన్‌ను అందించారు.

కారు వెనుక భాగంలో ఫుల్-విడ్త్ లైట్ బార్‌తో కనెక్ట్ చేసిన అద్భుతమైన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో సరికొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు. అయితే సైడ్ ప్రొఫైల్ మాత్రం దాదాపు పాతదానిలానే ఉంటుంది.

2026 టాటా పంచ్- ప్రీమియం ఇంటీరియర్, ఫీచర్లు..

ఈ కారు క్యాబిన్ లేఅవుట్ టాటా పంచ్ ఈవీ నుంచి ప్రేరణ పొందింది. పాత 7-ఇంచ్ స్క్రీన్ స్థానంలో ఇప్పుడు పెద్దదైన 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్​ని అందించారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది.

డ్రైవర్ కోసం 7-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

కారులో వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఆధునిక ఫీచర్లు చేరాయి.

టాప్ వేరియంట్లలో 360-డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిస్‌ప్లే ఫంక్షనాలిటీని కూడా అందించారు.

2026 టాటా పంచ్- పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్ ఆప్షన్..

ఈసారి టాటా పంచ్‌ ఫేస్​లిఫ్ట్​లో ఇంజిన్ పరంగా పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. సాధారణ కమ్యూటింగ్ కోసం పాత 88 హెచ్​పీ పవర్, 115 ఎన్​ఎం టార్క్ ఇచ్చే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎలాగో ఉంటుంది. కానీ హైవేలపై వేగంగా వెళ్లాలనుకునే వారి కోసం కొత్తగా 'iTurbo' టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ను ప్రవేశపెట్టారు. ఇది 118 హెచ్​పీ పవర్, 170 ఎన్​ఎం టార్క్​ని జనరేట్ చేస్తుంది. తక్కువ రన్నింగ్ కాస్ట్ (ఖర్చు) కోరుకునే వారి కోసం సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

2026 టాటా పంచ్- బెస్ట్ సేఫ్టీ ఎస్​యూవీ..

భద్రత విషయంలో టాటా కార్లకు తిరుగులేదు. ఈ కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ కూడా భారత్ ఎన్​సీఏపీలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను సొంతం చేసుకుంది. ఇందులో వేరియంట్లను బట్టి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా వల్ల సిటీ ట్రాఫిక్‌లో కారును పార్కింగ్ చేయడం మరింత సులభం కానుంది.

2026 టాటా పంచ్- వేరియంట్ల వారీగా ఎక్స్​షోరూం ధరల వివరాలు..

కొత్త ఇంజిన్లు, ఫీచర్ల కారణంగా టాటా పంచ్ ఎస్​యూవీ ధరల పరిధి ఇప్పుడు మరింత విస్తరించింది.

నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (5-స్పీడ్ మాన్యువల్): ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు.

పెట్రోల్ ఏఎంటీ వేరియంట్లు: ప్రారంభ ధర రూ. 7.59 లక్షలు.

కొత్త ఐ-టర్బో లైనప్: ప్రారంభ ధర రూ. 8.34 లక్షలు (ఇది కేవలం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే వస్తుంది).

సీఎన్జీ మాన్యువల్: ప్రారంభ ధర రూ. 6.74 లక్షలు.

సీఎన్జీ ఏఎంటీ : ప్రారంభ ధర రూ. 8.59 లక్షలు.

అంటే మీరు రూ. 10లక్షల ధరలోపే మంచి ఫ్యామిలీ ఎస్​యూవీని కొనుగోలు చేయవచ్చు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More