ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మహీంద్రా థార్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఐకానిక్ 3-డోర్ లైఫ్‌స్టైల్ లాడర్-ఫ్రేమ్ ఎస్‌యూవీని ఈసారి ‘మహీంద్రా థార్ ఓజీ’ పేరుతో కంపెనీ లాంచ్ చేసింది. రూ. 10.32 లక్షల నుంచి రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఇంట్రడక్టరీ ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ కారులో ఆకట్టుకునే డిజైన్ మార్పులు, అధునాతన ఫీచర్లను పొందుపరిచారు.

ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ ఓజీ వేరియంట్లు, వాటి ధరలు, ఇంజిన్ ఆప్షన్లు, బుకింగ్, డెలివరీ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
మహీంద్రా థార్ ఓజీ బుకింగ్‌లు, డెలివరీ వివరాలు..
మహీంద్రా థార్ ఓజీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా అధికారిక షోరూమ్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం అడ్వాన్స్ టోకెన్ మొత్తంగా రూ. 21,000 నిర్ణయించారు. ఈ నెల ఆఖరు నుంచే కస్టమర్లకు వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మహీంద్రా థార్ ఓజీ వేరియంట్లు, ఇంజిన్ ఆప్షన్లు..
కొత్త థార్ ఓజీ మోడల్‌ను ప్రధానంగా మూడు వేరియంట్ లైనప్‌లలో అందుబాటులోకి తెచ్చారు:
ఏఎక్స్టీ (ఎంట్రీ లెవెల్)
ఎల్ఎక్స్టీ (మిడ్ లెవెల్)
జెడ్ఎక్స్టీ (టాప్-ఎండ్ వేరియంట్)
డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా మహీంద్రా ఇందులో మూడు రకాల ఇంజిన్ కాన్ఫిగరేషన్లను ఇచ్చింది:
- 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్: బడ్జెట్, డైలీ కమ్యూట్ కోరుకునేవారికి అనుకూలం.
- 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్: వేగం, అధిక పవర్ కోరుకునేవారి కోసం.
- 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఆఫ్‌రోడింగ్ టార్క్‌ను అందించే పవర్‌ఫుల్ ఆప్షన్.
| మహీంద్రా థార్ ఓజీ- వేరియంట్లు, వాటి ధరలు, ఇంజిన్ ఆప్షన్లు.. | |||||||
|---|---|---|---|---|---|---|---|
| వేరియంట్ | 1.5 లీటర్ డీజిల్ | 2.0 లీటర్ టర్బో పెట్రోల్ | 2.2 లీటర్ డీజిల్ | ||||
| ఎంటీ 4x2 | ఎంటీ 4x4 | ఏటీ 4x2 | ఏటీ 4x4 | ఏటీ 4x2 | ఎంటీ 4x4 | ఏటీ 4x4 | |
| ఏఎక్స్టీ | రూ. 10.32 లక్షలు | - | - | - | - | - | - |
| ఎల్ఎక్స్టీ | రూ. 12.99 లక్షలు | రూ. 15.60 లక్షలు | రూ. 14.77 లక్షలు | రూ. 17.23 లక్షలు | రూ. 16.49 లక్షలు | రూ. 16.43 లక్షలు | రూ. 18 లక్షలు |
| జెడ్ఎక్స్టీ | రూ. 13.99 లక్షలు | రూ. 16.60 లక్షలు | రూ. 16.09 లక్షలు | రూ. 17.45 లక్షలు | రూ. 17.49 లక్షలు | రూ. 17.49 లక్షలు | రూ. 18.99 లక్షలు |
| *పైన చెప్పిన ధరలు అన్నీ ఇంట్రొడక్టరీ, ఎక్స్‌షోరూం | |||||||
ఈ ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటితో పాటు కస్టమర్లు తమ ప్రాధాన్యతను బట్టి 4x2 (ఆర్డబ్ల్యూడీ) లేదా అత్యధిక సామర్థ్యం ఉన్న 4x4 డ్రైవ్‌ట్రెయిన్ మోడళ్లను ఎంచుకోవచ్చు.
మహీంద్రా థార్ ఓజీ ధర.. పరిమిత సమయమే!
{{/usCountry}}ఈ ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటితో పాటు కస్టమర్లు తమ ప్రాధాన్యతను బట్టి 4x2 (ఆర్డబ్ల్యూడీ) లేదా అత్యధిక సామర్థ్యం ఉన్న 4x4 డ్రైవ్‌ట్రెయిన్ మోడళ్లను ఎంచుకోవచ్చు.
మహీంద్రా థార్ ఓజీ ధర.. పరిమిత సమయమే!
{{/usCountry}}ప్రస్తుతం ప్రకటించిన రూ. 10.32 లక్షల నుంచి రూ. 18.99 లక్షల ధరలు కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రారంభ విక్రయాలు ముగిసిన తర్వాత వీటి ధరలను పెంచే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన ఫ్రంట్ లుక్, కొత్త ఇంటీరియర్ ఫీచర్లు, వైవిధ్యభరితమైన ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ ఎస్‌యూవీ, భారతీయ రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.