Mahindra Thar OG : మహీంద్రా థార్ ఓజీ- వేరియంట్లు, వాటి ధరలు, బుకింగ్ వివరాలు..

మహీంద్రా కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన 3-డోర్ ఎస్‌యూవీని సరికొత్త అప్‌డేట్లతో 'థార్ ఓజీ' పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు ప్రారంభం కాగా, ఈ నెల ఆఖరు నుంచే డెలివరీలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వేరియంట్లు, వాటి ధరలు, ఇంజిన్ ఆప్షన్లను ఇక్కడ చూసేయండి.

Published on: Sep 23, 2026, 10:45:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మహీంద్రా థార్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఐకానిక్ 3-డోర్ లైఫ్‌స్టైల్ లాడర్-ఫ్రేమ్ ఎస్‌యూవీని ఈసారి ‘మహీంద్రా థార్ ఓజీ’ పేరుతో కంపెనీ లాంచ్ చేసింది. రూ. 10.32 లక్షల నుంచి రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఇంట్రడక్టరీ ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ కారులో ఆకట్టుకునే డిజైన్ మార్పులు, అధునాతన ఫీచర్లను పొందుపరిచారు.

మహీంద్రా థార్ ఓజీ ఇదిగో..
మహీంద్రా థార్ ఓజీ ఇదిగో..

ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ ఓజీ వేరియంట్లు, వాటి ధరలు, ఇంజిన్ ఆప్షన్లు, బుకింగ్, డెలివరీ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మహీంద్రా థార్ ఓజీ బుకింగ్‌లు, డెలివరీ వివరాలు..

మహీంద్రా థార్ ఓజీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా అధికారిక షోరూమ్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం అడ్వాన్స్ టోకెన్ మొత్తంగా రూ. 21,000 నిర్ణయించారు. ఈ నెల ఆఖరు నుంచే కస్టమర్లకు వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

మహీంద్రా థార్ ఓజీ వేరియంట్లు, ఇంజిన్ ఆప్షన్లు..

కొత్త థార్ ఓజీ మోడల్‌ను ప్రధానంగా మూడు వేరియంట్ లైనప్‌లలో అందుబాటులోకి తెచ్చారు:

ఏఎక్స్​టీ (ఎంట్రీ లెవెల్)

ఎల్​ఎక్స్​టీ (మిడ్ లెవెల్)

జెడ్​ఎక్స్​టీ (టాప్-ఎండ్ వేరియంట్)

డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా మహీంద్రా ఇందులో మూడు రకాల ఇంజిన్ కాన్ఫిగరేషన్లను ఇచ్చింది:

  • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్: బడ్జెట్, డైలీ కమ్యూట్ కోరుకునేవారికి అనుకూలం.
  • 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్: వేగం, అధిక పవర్ కోరుకునేవారి కోసం.
  • 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఆఫ్‌రోడింగ్ టార్క్‌ను అందించే పవర్‌ఫుల్ ఆప్షన్.
మహీంద్రా థార్ ఓజీ- వేరియంట్లు, వాటి ధరలు, ఇంజిన్ ఆప్షన్లు..
వేరియంట్1.5 లీటర్ డీజిల్2.0 లీటర్ టర్బో పెట్రోల్2.2 లీటర్ డీజిల్
ఎంటీ 4x2ఎంటీ 4x4ఏటీ 4x2ఏటీ 4x4ఏటీ 4x2ఎంటీ 4x4ఏటీ 4x4
ఏఎక్స్​టీరూ. 10.32 లక్షలు------
ఎల్​ఎక్స్​టీరూ. 12.99 లక్షలురూ. 15.60 లక్షలురూ. 14.77 లక్షలురూ. 17.23 లక్షలురూ. 16.49 లక్షలురూ. 16.43 లక్షలురూ. 18 లక్షలు
జెడ్​ఎక్స్​టీరూ. 13.99 లక్షలురూ. 16.60 లక్షలురూ. 16.09 లక్షలురూ. 17.45 లక్షలురూ. 17.49 లక్షలురూ. 17.49 లక్షలురూ. 18.99 లక్షలు
*పైన చెప్పిన ధరలు అన్నీ ఇంట్రొడక్టరీ, ఎక్స్​షోరూం

ఈ ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటితో పాటు కస్టమర్లు తమ ప్రాధాన్యతను బట్టి 4x2 (ఆర్​డబ్ల్యూడీ) లేదా అత్యధిక సామర్థ్యం ఉన్న 4x4 డ్రైవ్‌ట్రెయిన్ మోడళ్లను ఎంచుకోవచ్చు.

మహీంద్రా థార్ ఓజీ ధర.. పరిమిత సమయమే!

ప్రస్తుతం ప్రకటించిన రూ. 10.32 లక్షల నుంచి రూ. 18.99 లక్షల ధరలు కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రారంభ విక్రయాలు ముగిసిన తర్వాత వీటి ధరలను పెంచే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన ఫ్రంట్ లుక్, కొత్త ఇంటీరియర్ ఫీచర్లు, వైవిధ్యభరితమైన ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ ఎస్‌యూవీ, భారతీయ రఫ్‌ అండ్ టఫ్‌ డ్రైవింగ్ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More