జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ'ని ప్రవేశపెట్టింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ప్రీమియం ఈవీ.. గరిష్టంగా రూ. 23.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. మరి మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇందులోని వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఆడాప్ట్ ఎన్ఈవీ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త డిజైన్..

ఎంజీ కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన 'ఆడాప్ట్ ఎన్ఈవీ' మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మొదటి వాహనం ఇదే కావడం విశేషం. ఈ ఆర్కిటెక్చర్ వివిధ రకాల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాంకేతికతలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా 5-సీటర్, 7-సీటర్ లేఅవుట్లలో ఇవి లభిస్తున్నాయి.
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీలోని ఈ మూడు వేరియంట్లలో ఏది ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఫీచర్లు, ధరను సరిపోల్చి చూస్తే మిడ్ రేంజ్ వేరియంట్ అయిన ‘ఎక్స్‌క్లూజివ్’ అత్యుత్తమ ‘వాల్యూ ఫర్ మనీ’ మోడల్‌గా నిలుస్తుంది. రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే ఈ వేరియంట్, చెల్లించే ప్రతి రూపాయికి తగిన విలువను అందిస్తుంది!
| ఎంజీ టోమాహాక్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు.. |
|---|
|
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బేస్ వేరియంట్ 'ఎక్సైట్'తో పోలిస్తే, ఎక్స్‌క్లూజివ్ మోడల్‌లో అధునాతన సౌకర్యాలు లభిస్తాయి. ఇందులో వేడి, గాలులను నియంత్రించే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ సౌకర్యంతో కూడిన 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్, బూట్ ఓపెన్ చేయడానికి ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్‌గేట్ వంటి రోజువారీ ప్రయాణాల్లో ఎంతో ఉపయోగపడే ఫీచర్లను అందించారు. నేటితరం కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా కోరుకునే హంగులు ఇవే.
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- 'బీఏఏఎస్' ఆఫర్..
పెద్ద కుటుంబాలు ఉండే మన దక్షినాది కొనుగోలుదారులకు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లోని 7-సీటర్ ఆప్షన్ చక్కటి ఎంపికగా మారుతుంది. లోపల విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండటంతో లాంగ్ డ్రైవ్‌లు, ఫ్యామిలీ ట్రిప్పులు హాయిగా సాగుతాయి.
{{/usCountry}}పెద్ద కుటుంబాలు ఉండే మన దక్షినాది కొనుగోలుదారులకు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లోని 7-సీటర్ ఆప్షన్ చక్కటి ఎంపికగా మారుతుంది. లోపల విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండటంతో లాంగ్ డ్రైవ్‌లు, ఫ్యామిలీ ట్రిప్పులు హాయిగా సాగుతాయి.
{{/usCountry}}ప్రారంభ కొనుగోలు ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి ఎంజీ అందిస్తున్న 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) పథకం ఎంతో ఊరటనిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా కారు ప్రారంభ ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. బ్యాటరీకి విడిగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే సరిపోతుంది.
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- 517 కిలోమీటర్ల రేంజ్..
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఏ వేరియంట్ ఎంచుకున్నా సామర్థ్యంలో ఎలాంటి వ్యత్యాసమూ ఉండదు. అన్ని వేరియంట్లలోనూ 69.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 201 బీహెచ్పీ గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంఐడీసీ ప్రామాణికాల ప్రకారం ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
అత్యుత్తమ రేంజ్, లగ్జరీ ఫీచర్లు, రీజనబుల్ ధర కోరుకునే వారికి ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ తిరుగులేని ఆప్షన్!