PM Kisan : ఒక్కో రైతు ఖాతాలోకి రూ. 2 వేలు - ఈ నెలలోనే పీఎం కిసాన్ నిధులు..! ఇవిగో వివరాలు

పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి చివర్లో ఈ నగదును జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Published on: Feb 18, 2026 7:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడత కింద రైతు ఖాతాలో రూ. 2 వేలు జమ చేస్తుంది.

పీఎం కిసాన్ యోజన
పీఎం కిసాన్ యోజన

ఈ నెలాఖారులో 22వ విడత …!

పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల చివర్లో ఈ నిధులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 19వ విడతను విడుదల చేశారు. 2024లో…. 16వ విడత మొత్తం ఫిబ్రవరి 28న జమ చేయబడింది. 2023లో 13వ విడతను ఫిబ్రవరి 27న పూర్తి చేశారు.

ఈ తేదీల ఆధారంగా చూస్తే… ఈ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసే సూచనలున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుంది.

పీఎం కిసాన్ యోజన 21వ విడతను ప్రధాని మోదీ గతేడాది నవంబర్ 19న విడుదల చేశారు. 9.35 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రూ .18,000 కోట్లకు పైగా పంపిణీ చేశారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ డబ్బులను అందజేస్తుంది. మొదటి 20 విడతల కింద 11 కోట్ల రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్లకు పైగా డబ్బులను జమ చేశారు.

పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే, లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా పేమెంట్ వివరాలను కూడా పొందవచ్చు.

పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

  • ముందుగా పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'నో యువర్ స్టేటస్' (Know Your Status) లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా పీఎం-కిసాన్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయమని అడుగుతుంది.
  • వివరాలను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను పూరించండి.
  • 'గెట్ స్టేటస్' (Get Status) పై క్లిక్ చేయండి.
  • మీకు చెల్లించిన వివరాలు డిస్ ప్లే అవుతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఏంటి..?

2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

2. పీఎం కిసాన్ నిధులు ఎలా ఇస్తారు..?

ఈ స్కీమ్ కింద ఇచ్చే రూ. 6,000ను మూడు సమాన విడతల్లో ఇస్తారు. ప్రతి విడత రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.

3. పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హులెవరు..?

వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. రైతులు తమ భూమి వివరాలను తప్పనిసరిగా పథకం పోర్టల్‌లో నమోదు (Seeding) చేసి ఉండాలి. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఏడాదికి రూ. 6 వేలు మాత్రమే చెల్లిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More