పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ), ఎరువుల కొరత ఏర్పడుతోందంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను బద్నాం చేయడమే లక్ష్యంగా విపక్షాలు ఈ వదంతులు సృష్టించాయని, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సంబరపడటం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గుజరాత్‌లోని బనాస్‌కాంత జిల్లా భిల్డీలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఆఖరి శ్వాస వరకు ప్రజలకే సేవ

"ఇరాన్ యుద్ధం తర్వాత రైతులకు ఎరువులు అందవని, ప్రజలకు ఎల్పీజీ దొరకదని కొందరు కావాలనే పుకార్లు వ్యాప్తి చేశారు. మోదీ ప్రతిష్టను దిగజార్చడమే వారి ఏకైక అజెండా. నా జీవితపు చివరి క్షణం వరకు దేశ ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటా," అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
ఈ పర్యటనలో భాగంగా బనాస్‌కాంతలో రూ.14,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పీఎం మోదీ ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలోనే 'భారత్ గోజాతి ప్రజనన, పరిశోధనా కేంద్రాన్ని' ఆయన జాతికి అంకితం చేశారు.
పిఎం-కిసాన్ 24వ విడత నిధుల విడుదల
దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 'పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత కింద రూ.18,000 కోట్లకు పైగా సొమ్మును పీఎం మోదీ నేరుగా జమ చేశారు. "మన రైతులు, అన్నదాతలు ఈ దేశానికి బలమైన పునాదులు. రైతు సాధికారతకే మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తోంది," అని ఆయన చెప్పారు. 2013-14తో పోలిస్తే దేశంలో వ్యవసాయ బడ్జెట్ ఐదు రెట్లకు పైగా పెరిగిందని, పిఎం-కిసాన్ పథకం కోట్లాది మంది చిన్నకారు రైతుల జీవితాల్లో కీలక భాగమైందని పేర్కొన్నారు.
తాజా విడతతో గుజరాత్‌లోని 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమకాగా, ఒక్క బనాస్‌కాంత జిల్లాలోనే దాదాపు రూ.50 కోట్లు లబ్ధిదారులకు అందాయి.
బనాస్‌కాంతలో కీలక అభివృద్ధి పనులు
{{/usCountry}}తాజా విడతతో గుజరాత్‌లోని 50 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమకాగా, ఒక్క బనాస్‌కాంత జిల్లాలోనే దాదాపు రూ.50 కోట్లు లబ్ధిదారులకు అందాయి.
బనాస్‌కాంతలో కీలక అభివృద్ధి పనులు
{{/usCountry}}కాంక్రేజ్ ఆవుల జాతి సంరక్షణ, జన్యు అభివృద్ధి లక్ష్యంగా భిల్డీలో 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ గోజాతి ప్రజనన, పరిశోధనా కేంద్రాన్ని పీఎం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ఆవుల నాణ్యత పెంపు ప్రక్రియ 10 నుంచి 20 రెట్లు వేగవంతం కానుంది.
అంతేకాకుండా బనాస్ డెయిరీకి చెందిన రెండు బయో-సిఎన్‌జి ప్లాంట్లను (థరాడ్‌లో రోజుకు 75 మెట్రిక్ టన్నుల పేడ సామర్థ్యం, రాధన్‌పూర్‌లో రోజుకు 100 మెట్రిక్ టన్నుల పేడ సామర్థ్యం) అందుబాటులోకి తెచ్చారు. సనాదర్‌లో బంగాళాదుంప ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణ పనులు, పాలన్‌పూర్‌లో ఆటోమేటెడ్ స్టోరేజ్ అండ్ రీట్రీవల్ సిస్టమ్‌లను పీఎం మోదీ ప్రారంభించారు.