దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని హౌడా స్టేషన్ నుంచి అస్సాంలోని గుహవాటికి తొలి సర్వీస్‌ను ప్రారంభించారు. కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకించి ఈ స్లీపర్ ట్రైన్ ఏర్పాటైంది.
ప్రత్యేకతలివిగో…
- ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ 16 కోచ్‌లతో ఉంటుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లటం ఈ రైలు స్పెషాలిటీ. ప్రస్తుతానికి అయితే గరిష్టంగా గంటకు 120-130 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు.
- అన్నీ ఏసీ బోగీలే కానీ కొన్ని వ్యత్యాసాలుంటాయి. 11 ఏసీ బోగీలు టైర్ 3, నాలుగు టైర్ 2 ఏసీ బోగీలు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి.
- ప్రపంచ స్థాయి సస్పెన్షన్ సిస్టమ్ తో కూడిన బెర్తులుంటాయి. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
- ఈ ఆధునాత రైలులో అత్యంత పరిశుభ్రతను పాటిస్తారు. సాంకేతికతో కూడిన ఆధునాతన క్రిమి సంహారక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
- సమగ్రమైన ఆన్‌బోర్డ్ నిఘా ఉంటుంది. స్వదేశీ కవచ్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్‌తో కూడిన వ్యవస్థ పని చేస్తుంది.
- ఆటోమేటిక్ స్లైడింగ్ తలుపులు ప్రయాణం ఉంటుంది. రైలు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి.
- క్యాటరింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.కామాఖ్య నుంచి హౌరాకు ప్రయాణించే ప్రయాణీకులకు అస్సామీ వంటకాలు వడ్డిస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు తిరుగు ప్రయాణంలో ఉన్నవారితి బెంగాలీ వంటకాలను అందిస్తారు.
- ఈ రైలు థర్డ్ ఏసీ సీటు ధర సుమారు రూ.2,300, సెకండ్ ఏసీలో అయితే రూ.3 వేలు, ఫస్ట్ ఏసీ అయితే రూ.3,600 ఉండే అవకాశం ఉంటుంది.
- ఈ ట్రైన్ ద్వారా హౌరా-గువహతి (కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గిస్తోందని రైల్వేశాఖ చెబుతోంది. పర్యాటక రంగానికి కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్ భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తోంది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}