సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' (PM-VBRY) పథకాన్ని అమలు చేస్తోంది. రూ.99,446 కోట్ల అంచనా వ్యయంతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు రెండేళ్ల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే నూతన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాల్లోకి (DBT రూపంలో) జమ చేస్తున్నారు.
పథకం విభాగాలు.. ఎవరెవరికి ప్రయోజనం?

పీఎం-వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రభుత్వం రెండు ముఖ్య భాగాలుగా విభజించింది.
పార్ట్ A (ఉద్యోగులకు ప్రోత్సాహకం): మొదటిసారిగా ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.7,500 చొప్పున రెండు విడతల్లో చెల్లిస్తారు.
పార్ట్ B (యజమానులకు ఊరట): కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగులను చేర్చుకున్నందుకు గాను ఒక్కో ఉద్యోగిపై నెలకు గరిష్ఠంగా రూ.3,000 వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకం ఇస్తారు. ఒకవేళ ఆ సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగానికి చెందినదైతే ఈ ప్రయోజనం నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది.
అర్హతలు ఇవే
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి ఉద్యోగులు కింద పేర్కొన్న నిబంధనలను కలిగి ఉండాలి.
తొలిసారి నమోదు: 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో మొదటిసారిగా ఈపీఎఫ్ఓ నమోదిత సంస్థలో చేరి ఉండాలి. 2025 ఆగస్టు 1కి ముందు ఈపీఎఫ్ఓ లేదా మినహాయింపు పొందిన ట్రస్టుల్లో సభ్యుడిగా ఉండకూడదు.
వేతన పరిమితి: నెలకు పొందే స్థూల వేతనం రూ.1,00,000 మించకూడదు.
సర్వీస్ నిబంధన: అదే సంస్థలో వరుసగా కనీసం 6 నెలల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.
ఈ-కేవైసీ: ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా యుఏఎన్ (UAN) ఖాతాను యాక్టివేట్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఖాతాకు డిబిటి (DBT) సౌకర్యం అనుసంధానమై ఉండాలి.
రెండవ విడత రూ.7,500 ఎలా పొందాలి?
{{/usCountry}}ఈ-కేవైసీ: ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా యుఏఎన్ (UAN) ఖాతాను యాక్టివేట్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఖాతాకు డిబిటి (DBT) సౌకర్యం అనుసంధానమై ఉండాలి.
రెండవ విడత రూ.7,500 ఎలా పొందాలి?
{{/usCountry}}మొదటి విడత రూ.7,500 ప్రోత్సాహకం 6 నెలల సర్వీస్ పూర్తయ్యాక జమ అవుతుంది. అయితే, మిగిలిన రెండవ విడత రూ.7,500 పొందాలంటే ఉద్యోగి 12 నెలల నిరంతర సర్వీసును పూర్తి చేయడంతో పాటు ఈపీఎఫ్ఓ నిర్వహించే 'ఫైనాన్షియల్ లిటరసీ కోర్సు' (FLC) పూర్తి చేయడం తప్పనిసరి.
ఆర్థిక అవగాహన పెంపొందించే ఈ కోర్సును పూర్తి చేసే విధానాన్ని ఈపీఎఫ్ఓ వివరించింది.
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ సందర్శించి 'Employee Login' పై క్లిక్ చేయాలి.
- మీ యుఏఎన్ (UAN) నంబర్, పాస్‌వర్డ్‌లతో సైన్ ఇన్ అవ్వాలి.
- ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'PMVBRY' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'Financial Literacy Course' ఎంచుకోవాలి (దీనిలో మొత్తం 5 మోడ్యూల్స్ ఉంటాయి. ఒక్కో మోడ్యూల్ చదివి ప్రశ్నలకు జవాబులిస్తే తదుపరి మోడ్యూల్ అన్‌లాక్ అవుతుంది).
- అన్ని మోడ్యూళ్లు, అసెస్‌మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ లభిస్తుంది.
- ఈ కోర్సు పూర్తి చేసి 12 నెలల సర్వీస్ క్లియర్ అయిన వెంటనే, రెండవ విడత ప్రోత్సాహకం నేరుగా మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. పొదుపు అలవాటును పెంచేందుకు ఈ ప్రోత్సాహకంలో కొంత మొత్తాన్ని డిపాజిట్ సాధనాల్లో భద్రపరిచి, ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.