Poco X8 Pro Max : పోకో ఎక్స్8 ప్రో సిరీస్ లాంచ్- 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో! ధరలు ఎంతంటే..
Poco X8 Pro price : భారత మార్కెట్లోకి పోకో ఎక్స్8 ప్రో సిరీస్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ బ్యాటరీ, అత్యాధునిక మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, ఐరన్ మ్యాన్ ఎడిషన్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'పోకో' భారతీయ వినియోగదారుల కోసం తన మోస్ట్ అవేటెడ్ ఎక్స్8 సిరీస్‌ను లాంచ్ చేసింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పోకో ఎక్స్8 ప్రో 5జీ (Poco X8 Pro 5G), పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ (Poco X8 Pro Max 5G) తో పాటు ప్రత్యేకంగా 'ఐరన్ మ్యాన్ ఎడిషన్'ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ముఖ్యంగా ప్రో మాక్స్ వేరియంట్‌లో అందించిన భారీ బ్యాటరీ సామర్థ్యం టెక్ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- ధర, లభ్యత వివరాలు..
భారతదేశంలో ఈ స్మార్ట్ఫోన్ల ధరలు వేరియంట్ల వారీగా ఇలా ఉన్నాయి:
పోకో ఎక్స్8 ప్రో 5జీ:
8 GB + 256 GB వేరియంట్ ధర: రూ. 32,999
12 GB + 256 GB వేరియంట్ ధర: రూ. 35,999
ఐరన్ మ్యాన్ ఎడిషన్ (12 GB + 256 GB): రూ. 37,999
పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ:
12 GB + 256 GB వేరియంట్ ధర: రూ. 42,999
12 GB + 512 GB (టాప్ ఎండ్) ధర: రూ. 46,999
పోకో ఎక్స్8 ప్రో సిరీస్ సేల్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్లు మార్చ్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వేదికగా అమ్మకానికి రానున్నాయి.
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- అద్భుతమైన డిస్‌ప్లే.. అదిరిపోయే బ్యాటరీ!
పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ మోడల్ 6.83 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి పోటీగా వచ్చిన ప్రో వెర్షన్ 6.59 ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఈ సిరీస్‌లో హైలైట్ ఏంటంటే బ్యాటరీ సామర్థ్యం! పోకో ఎక్స్8 ప్రో 5జీలో 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ప్రో మాక్స్ వేరియంట్‌లో ఏకంగా 9,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ రెండు ఫోన్లు కూడా 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అంటే భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- పర్ఫార్మెన్స్, కెమెరా..
శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోసం పోకో ఎక్స్8 ప్రో మాక్స్ మోడల్‌లో 3 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్‌ను వాడారు. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా పని చేస్తుంది. అదే సమయంలో ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. వేడిని తగ్గించడానికి '3డీ ఐస్ లూప్' కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
కెమెరాల విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ వెనుక వైపు పిల్ షేప్డ్ మాడ్యూల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
ప్రధాన కెమెరా: 50 మెగాపిక్సెల్ (OIS సపోర్ట్‌తో)
వైడ్ యాంగిల్: 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్
సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా
ఈ ఫోన్ల ద్వారా 4కే క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అదనంగా వీటికి IP68, IP69 రేటింగ్స్ ఉండటం వల్ల నీరు, ధూళి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ప్రో మాక్స్ మోడల్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.
మరి మీరు ఈ స్మార్ట్‌ఫోన్స్‌ని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


