టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోకో ఎక్స్8 సిరీస్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఒక గ్రాండ్ ఈవెంట్లో సంస్థ ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేయనుంది. అవి.. పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్, పోకో ఎక్స్8 ప్రో. ఈ రెండు కూడా 5జీ గ్యాడ్జెట్సే. కాగా, లాంచ్‌కి ముందు ఈ మోడల్స్‌కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
పోకో ఎక్స్8 సిరీస్- ఇండియన్ వేరియంట్‌కే పవర్ ఎక్కువ!

సాధారణంగా గ్లోబల్ వేరియంట్లు మెరుగ్గా ఉంటాయని అందరూ భావిస్తారు, కానీ ఈసారి పోకో భిన్నంగా ఆలోచించింది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడల్‌లో 8,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, భారతదేశంలో మాత్రం దీనిని 9,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లలో ఒకటిగా నిలవనుంది. మరోవైపు ప్రో మోడల్ గ్లోబల్, ఇండియాలోనూ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
పోకో ఎక్స్8 సిరీస్- డిస్‌ప్లే, కెమెరా విశేషాలు..
డిస్‌ప్లే: ప్రో మ్యాక్స్ వేరియంట్ 6.83- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ప్రో మోడల్‌లో 6.59- ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది.
కెమెరా: రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 'పిల్ షేప్' కెమెరా మాడ్యూల్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ప్రోసెసర్: ప్రో మ్యాక్స్ మోడల్‌లో శక్తివంతమైన 3ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్ ఉండగా, ప్రో వేరియంట్‌లో 4ఎన్ఎం డైమెన్సిటీ 8500 అల్ట్రా ఎస్ఓసీని అమర్చారు.
పోకో ఎక్స్8 సిరీస్- స్టోరేజ్, ఇతర ఫీచర్లు..
మెమరీ విషయానికి వస్తే, పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడల్ 12 GB+256 GB, 12 GB+512 GB వేరియంట్లలో లభించనుంది. పోకో ఎక్స్8 ప్రో మోడల్ మాత్రం 8 GB+256 GB, 8 GB+512 GB, 12 GB+512 GB అనే మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం ప్రో మ్యాక్స్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అదనంగా పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్‌లో 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
{{/usCountry}}మెమరీ విషయానికి వస్తే, పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడల్ 12 GB+256 GB, 12 GB+512 GB వేరియంట్లలో లభించనుంది. పోకో ఎక్స్8 ప్రో మోడల్ మాత్రం 8 GB+256 GB, 8 GB+512 GB, 12 GB+512 GB అనే మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం ప్రో మ్యాక్స్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అదనంగా పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్‌లో 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
{{/usCountry}}ముఖ్యంగా ఈ ఫోన్లు ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP66 నుంచి IP69K వరకు టాప్ గ్రేడ్ రేటింగ్స్‌ను కలిగి ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. లాంచ్ తర్వాత వీటి ధరతో పాటు ఇతర వివరాలు అందుబాటులోకి వస్తాయి.