...
...
Next Story

Tyre inflator : రూ. 2,999కే టైర్ ఇన్‌ఫ్లేటర్- ఇక బైక్ ప్రయాణం మరింత ప్రశాంతం!

టైరులో గాలి తగ్గిపోవడం అనేది ప్రతి రైడర్​కి ఇబ్బంది కలిగించే విషయం. ఇందుకోసమే మార్కెట్లో కొన్ని టైర్​ ఇన్​ఫ్లేటర్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కొత్త టైర్​ ఇన్​ఫ్లేటర్​ కూడా యాడ్​ అయ్యింది. రూ. 2999కే ఇది కొనుగోలు చేసుకోవచ్చు. దీని ఫీచర్లు..

Published on: May 24, 2026, 12:18:21 IST
Advertisement

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘పోర్ట్రానిక్స్’.. భారత మార్కెట్లోకి సరికొత్త పోర్టెబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్ ‘వాయు నానో’ని విడుదల చేసింది. బైక్‌లు, స్కూటర్లు, సైకిళ్లు నడిపేవారు ప్రయాణాల్లో అకస్మాత్తుగా టైర్లలో గాలి తగ్గినప్పుడు అత్యవసరంగా వాడుకోవడానికి ఈ వైర్‌లెస్ గ్యాడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 4,999 కాగా.. ప్రస్తుతం రూ. 2,999 లాంచ్ ఆఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో 12 నెలల (1 సంవత్సరం) వారంటీతో లభిస్తోంది. ఈ డివైజ్ ఫీచర్లు, ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.

ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఎయిర్..

పోర్ట్రానిక్స్ వాయు నానో
పోర్ట్రానిక్స్ వాయు నానో

120 పీఎస్​ఐ ప్రెజర్: ఈ చిన్న వాయు నానో ఇన్‌ఫ్లేటర్ గరిష్టంగా 120 పీఎస్​ఐ వరకు ప్రెజర్ అవుట్‌పుట్‌ను అందించగలదు.

వేగవంతమైన రీఫిల్లింగ్: సాధారణ బైక్ టైర్లలో కేవలం 5 నిమిషాల లోపే 0 నుండి 35 పీఎస్​ఐ వరకు గాలిని పూర్తిగా నింపగలదని కంపెనీ పేర్కొంది. ఇది సాధారణంగా బైక్ టైర్లకు 45 పీఎస్​ఐ, సైకిల్ టైర్లకు 35 పీఎస్​ఐ వరకు సపోర్ట్ చేస్తుంది.

డిజిటల్ డిస్‌ప్లే: ఇందులో అమర్చిన డిజిటల్ స్క్రీన్ టైర్లలోని ప్రెజర్ రీడింగ్స్‌ను పీఎస్​ఐ, బీఏఆర్ యూనిట్లలో స్పష్టంగా చూపిస్తుంది. యూజర్లు తమ అవసరానికి అనుగుణంగా ప్రీసెట్ మోడ్స్ ఎంచుకోవచ్చు లేదా మాన్యువల్‌గా ప్రెజర్‌ను సెట్ చేసుకోవచ్చు.

వైర్‌లెస్ బ్యాటరీ అండ్ సేఫ్టీ ఫీచర్లు..

టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్: ఈ డివైజ్‌లో రెండు 600ఎంఏహెచ్ రీఛార్జబుల్ బ్యాటరీలు ఉన్నాయి. వీటికి వేగంగా ఛార్జింగ్ ఎక్కించడానికి టైప్-సీ పోర్ట్ అందించారు. వైర్‌లెస్ కావడం వల్ల ప్రయాణాల్లో బాహ్య పవర్ సోర్స్‌తో పనిలేకుండా ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.

ఆటోమేటిక్ కట్-ఆఫ్ : టైర్‌లో గాలి నింపేటప్పుడు మనం సెట్ చేసిన ప్రెజర్ లెవెల్ రాగానే ఈ డివైజ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనివల్ల టైర్లలో ఎక్కువ గాలి నిండి టైర్లు పేలిపోయే ప్రమాదం ఉండదు.

ప్రయాణాలు, అత్యవసర సమయాల్లో..

ఇందులో గాలి పైపు కనెక్షన్ కోసం 7.5 సెం.మీ ఎయిర్ హోస్ ఇచ్చారు.

రాత్రి వేళల్లో రోడ్డుపై బైక్ పంక్చర్ అయినా, గాలి తగ్గినా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ లైట్​ను అమర్చారు.

బైక్, సైకిల్ టైర్లతో పాటు స్పోర్ట్స్ బాల్స్ (ఫుట్‌బాల్, వాలీబాల్), ఇతర ఎయిర్ యాక్సెసరీస్‌లో గాలి నింపడానికి వీలుగా మల్టిపుల్ నాజిల్ అటాచ్‌మెంట్లను కూడా బాక్స్‌తో పాటు ఉచితంగా అందిస్తున్నారు.

భారత్‌లో టూ-వీలర్ రైడర్లు, టూరింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి పోర్టబుల్ ఎమర్జెన్సీ టూల్స్ ప్రతి ఒక్కరి వద్ద ఉండటం చాలా అవసరం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks