డబ్బును ప్రభుత్వ మద్దతు ఉన్న వివిధ చిన్న పొదుపు పథకాల్లో జమ చేస్తే, రిస్క్ తగ్గి పోర్ట్‌ఫోలియో సురక్షితంగా ఉంటుందని చాలామంది పెట్టుబడిదారులు భావిస్తారు. అయితే, ఇది పూర్తిగా పొరపాటు భావన అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్టాక్స్ లేదా వివిధ అసెట్ క్లాసెస్‌లో వైవిధ్యం కోసం పెట్టుబడి పెట్టినట్లుగా, ప్రభుత్వ పొదుపు పథకాలన్నింటిలోనూ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సార్వభౌమ హామీతో పనిచేసే స్థిర ఆదాయ ఆధారిత పథకాలు మాత్రమే. వీటి మధ్య తేడా కేవలం వాటి వ్యవధి, పన్ను మినహాయింపులు, విత్‌డ్రా నిబంధనల్లోనే తప్ప రిస్క్ లేదా భద్రత విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.
అన్ని పథకాలు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
"చాలామంది పెట్టుబడిదారులకు ఏదైనా ఒక చిన్న పొదుపు పథకం సరిపోతుంది. మీరు సాధించాలనుకుంటున్న ఆర్థిక లక్ష్యంపైనే మీరు ఎంచుకోవాల్సిన స్కీమ్ ఆధారపడి ఉంటుంది," అని '1 ఫైనాన్స్' పర్సనల్ ఫైనాన్స్ ట్రైనింగ్ హెడ్ అన్షి శ్రీవాస్తవ పేర్కొన్నారు. స్మాల్ సేవింగ్స్ పథకాలను షేర్ల లాగా పోగుచేసి వైవిధ్యం కోసం దాచుకోకూడదని, ప్రతి పథకానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
అలాగే ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ 'రైట్ రీసెర్చ్' వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సాధారణ పెట్టుబడిదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక్కటి ఉంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వైే)ను అదనంగా ఎంచుకోవచ్చని, పీపీఎఫ్‌తో పాటు ఎన్‌ఎస్‌సీ, కేవీపీలో కూడా పెట్టుబడి పెట్టడం వల్ల ఒకే తరహా ప్రయోజనాలు పునరావృతం (డూప్లికేట్) అవుతాయని చెప్పారు.
మీ ఆర్థిక లక్ష్యానికి తగ్గట్టుగా స్కీమ్‌ను ఎంచుకోండి..
కేవలం వడ్డీ రేట్లను చూసి స్కీమ్‌ను ఎంచుకోవడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పథకంలో చేరేముందైనా మూడు ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి:
- ఈ డబ్బు మీకు దేనికోసం ఉపయోగపడుతుంది?
- ఈ డబ్బు మీకు ఎప్పుడు అవసరం?
- అంతవరకు ఈ మొత్తాన్ని ముట్టుకోకుండా ఉంచగలరా?
ఏ స్కీమ్ ఎవరికి అనుకూలం?
{{/usCountry}}కేవలం వడ్డీ రేట్లను చూసి స్కీమ్‌ను ఎంచుకోవడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పథకంలో చేరేముందైనా మూడు ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి:
- ఈ డబ్బు మీకు దేనికోసం ఉపయోగపడుతుంది?
- ఈ డబ్బు మీకు ఎప్పుడు అవసరం?
- అంతవరకు ఈ మొత్తాన్ని ముట్టుకోకుండా ఉంచగలరా?
ఏ స్కీమ్ ఎవరికి అనుకూలం?
{{/usCountry}}పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: రిటైర్మెంట్ వంటి సుదీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఇది ఎంతో ఉత్తమమైనది. 15 సంవత్సరాల కాలమితి ఉండే ఈ పథకంలో వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను ఉండదు (ఈఈఈ స్టేటస్). ఉద్యోగంలో కొత్తగా చేరిన యువతకు ఇది దీర్ఘకాలిక పన్ను రహిత సంపద సృష్టికి చక్కటి పునాది వేస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై): ఇంట్లో చిన్నారి (ఆడపిల్ల) ఉన్న తల్లిదండ్రులకు ఇది ప్రత్యేకం. పాప చదువు, భవిష్యత్తు అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు. ఒకే కుటుంబంలో తండ్రి రిటైర్మెంట్ కోసం పీపీఎఫ్, కుమార్తె భవిష్యత్తు కోసం ఎస్ఎస్వై ఒకేసారి కొనసాగించవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ): సరిగ్గా ఐదేళ్ల కాలపరిమితితో నిర్దిష్టమైన ఆర్థిక లక్ష్యం ఉన్నవారికి ఇది సరిపోతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించినప్పటికీ, దీని ద్వారా వచ్చే వడ్డీపై పన్ను పడుతుంది.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ): ఇప్పటికే సెక్షన్ 80సీ పన్ను మినహాయింపుల పరిమితి ముగిసిపోయి, ఎలాంటి పన్ను ప్రయోజనం ఆశించకుండా ఒక నిర్దిష్ట కాలంలో డబ్బును రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది పరిమితంగా ఉపయోగపడుతుంది.
వడ్డీ రేటు కంటే పన్నులు, లిక్విడిటీయే ముఖ్యం!
చాలామంది ప్రకటనల్లో కనిపించే గరిష్ట వడ్డీ రేట్లను చూసి మురిసిపోతుంటారు. కానీ, పన్నులు తీసివేసిన తర్వాత వచ్చే అసలు రాబడిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సెబీ రజిస్టర్డ్ అడ్వైజర్ శశాంక్ ఉడుప సూచించారు.
ఉదాహరణకు, అధిక టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నవారికి పన్ను వర్తించే ఎక్కువ వడ్డీ రేటు కంటే, పన్ను మినహాయింపు ఉన్న కాస్త తక్కువ వడ్డీ రేటే ఎక్కువ నికర లాభాన్ని ఇస్తుంది!
లిక్విడిటీ సమస్యను మర్చిపోవద్దు..
అత్యవసర సమయాల్లో డబ్బు ఉపసంహరించుకోవడానికి (లిక్విడిటీ) స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అంతగా సహకరించవు. వీటిలో కఠినమైన లాక్-ఇన్ నిబంధనలు ఉంటాయి. అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ వైపే మొగ్గు చూపాలి. బ్యాంక్ ఎఫ్‌డీలలో నిధులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయనేది ముఖ్యం కాదు, మీ నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలకు ఏది అవసరమనేదే ముఖ్యం. మీ రిటైర్మెంట్ కోసం ఒక పీపీఎఫ్, కుమార్తె కోసం ఒక సుకన్య సమృద్ధి యోజన ఉంటే సరిపోతుంది. అన్ని స్కీమ్‌లలోనూ పెట్టుబడి పెట్టి పోర్ట్‌ఫోలియోను అనవసరంగా సంక్లిష్టం చేసుకోకండి.