...
...
Next Story

Pralhad Joshi: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఖాళీ అయిన విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Jul 25, 2026, 20:34:33 IST
Advertisement

Pralhad Joshi: నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్ధృత పోరాటం దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆమోదించిన రాష్ట్రపతి

ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ (PTI File photo)
ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ (PTI File photo)

నీట్ లీకేజీ వ్యవహారంలో సీజేపీ ఉద్యమం సంచలనంగా మారింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ లక్ష్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. చివరకు ధర్యేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది.

ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ

ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు తన పాత మంత్రిత్వ శాఖలతో పాటు విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ తన ప్రకటనలో తెలిపింది.

ఈ మంత్రిత్వ శాఖలు

ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలతో పాటు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 లో ప్రధాని మోదీ మంత్రివర్గంలోకి మళ్లీ ఎన్నికైన ఈ సీనియర్ నాయకుడికి.. ఇప్పుడు అత్యంత కీలకమైన విద్యాశాఖ అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.

తదుపరి సవాళ్లు

ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవస్థను ప్రక్షాళన చేయడం, రద్దయిన ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా తిరిగి నిర్వహించడం, బాధితులైన కోట్లాది మంది విద్యార్థులలో నమ్మకాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలు ప్రహ్లాద్ జోషీ ముందు ఉన్నాయి.

నిరసన విరమణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికి కేంద్రం ఒప్పుకోవడంతో ఉద్యమాన్ని సీజేపీ నిలిపివేసింది. నిరసన విరమించింది. ఏదేమైనా తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు చేసిన ఈ ఉద్యమం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe