...
...
Next Story

Raghav Chadha : సీఏ నుంచి బీజేపీ వరకు- ‘యంగ్​ గ్లోబల్​ లీడర్’ రాఘవ్​ చద్దా ప్రస్థానం..

Raghav Chadha BJP : బీజేపీలో చేరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రాఘవ్​ చద్దా. ఈ ఆప్​ మాజీ ఎంపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారారు. ఈ నేపథ్యంలో రాఘవ్​ చద్దా ఎడ్యుకేషన్, సీఏ టు పార్లమెంట్​ జర్నీ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 25, 2026, 05:58:28 IST
Advertisement

దిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నెముకలా ఉన్న రాఘవ్ చద్దా ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం ఆయనొక్కరే కాదు, రాజ్యసభలోని మెజారిటీ 'ఆప్' ఎంపీలు కూడా ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించుకుని బీజేపీలో చేరిపోయారు. "రాజకీయాలను నేను ఎంచుకోలేదు.. రాజకీయాలే నన్ను ఎంచుకున్నాయి" అని గతంలో చెప్పిన రాఘవ్.. ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.

సీఏ నుంచి పార్లమెంట్ వరకు.. రాఘవ్ ప్రస్థానం!

ఆప్ మాజీ ఎంపీ రాఘవ్​ చద్దా.. (PTI)
ఆప్ మాజీ ఎంపీ రాఘవ్​ చద్దా.. (PTI)

రాఘవ్ చద్దా కేవలం ఒక నేత మాత్రమే కాదు, అత్యున్నత విద్యావంతుడు కూడా! ఆయన విద్యాభ్యాసం యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.

స్కూలింగ్: దిల్లీలోని ప్రఖ్యాత మోడరన్ స్కూల్‌లో ప్రాథమిక విద్య.

డిగ్రీ: దిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్ పట్టా.

వృత్తి: దేశంలోనే అత్యంత కఠినమైన ఛార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షను 2011లో పూర్తి చేశారు.

విదేశీ విద్య: ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్​ఎస్​ఈ)లో ఉన్నత చదువులు అభ్యసించారు.

వృత్తిరీత్యా సీఏ అయిన చద్దా, తన మేధస్సుతో ఆప్ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు ఆయనను అతి చిన్న వయసులోనే పార్టీ అధికార ప్రతినిధిగా నిలబెట్టింది.

ఇదీ చూడండి : ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్: బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు

పార్లమెంట్‌లో మెరిసిన 'యంగ్ గ్లోబల్ లీడర్'..

రాఘవ్ చద్దా పార్లమెంటులో తన గళాన్ని బలంగా వినిపించారు. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెjార్చ్ ప్రకారం..

ప్రశ్నల పరంపర: ఇప్పటివరకు పార్లమెంట్‌లో 350 ప్రశ్నలు అడిగి, 57 చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాగా.. ఏ పార్టీపై ఇంతకాలం ప్రశ్నల వర్షం కురిపించారో ఇప్పుడు ఆయన అదే పార్టీలో చేరిపోవడం గమనార్హం.

ప్రజా సమస్యలు: గ్రామీణ క్రీడల ప్రోత్సాహం, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, డిజిటల్ వివక్ష వంటి అంశాలపై ఆయన పోరాటం అభినందనీయం.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆయనను 'యంగ్ గ్లోబల్ లీడర్'గా గుర్తించడమే కాకుండా.. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానాలు అందాయి. 'ఇండియా-యూకే అచీవర్స్' అవార్డు కూడా ఆయనను వరించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతున్నారా?

అవును, మీడియా నివేదికల ప్రకారం రాఘవ్ చద్దా తనతో పాటు మరికొందరు ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

2. రాఘవ్ చద్దా చదువుకున్న విద్యాసంస్థలు ఏవి?

ఆయన దిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఐసీఏఐ నుంచి సీఏ పూర్తి చేయడమే కాకుండా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్​లో కూడా చదువుకున్నారు.

3. పార్లమెంట్‌లో ఆయన పనితీరు ఎలా ఉంది?

ఆయనకు పార్లమెంట్‌లో 97% హాజరు ఉంది. దాదాపు 350 ప్రశ్నలు అడిగి, 57 జాతీయ స్థాయి చర్చల్లో పాల్గొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe