ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఛలో ఢిల్లీ రాంలీలా మార్చ్' నిర్వహిస్తోంది. ఈ నిరసన ప్రదర్శనలో దేశప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవడానికి, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ మార్చ్ అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల లాఠీలకు, బెదిరింపులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. భాజపా ప్రభుత్వం తన పాతచీకటి వ్యూహాలను అమలు చేసే సాహసం చేయలేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) ద్వారా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. "ఈ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం చేస్తున్నది కాదు. ఇది భారతదేశ ఆత్మను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి జరుగుతున్న ఉద్యమం. నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ల వైఖరితో విసిగిపోయిన వారంతా ఈ మార్చ్‌లో భాగస్వాములు కావాలి. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా అడుగు ముందుకు వేయండి" అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
విద్యార్థులు, యువత ముందుకు రావాలి
దేశంలో భావప్రకటనా స్వేచ్ఛపై, ఆలోచనా విధానంపై దాడులు జరుగుతున్నాయని అనిపిస్తే యువత, విద్యార్థి సంఘాలు వెంటనే గళమెత్తాలని రాహుల్ గాంధీ కోరారు. "మీ రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా, దేశ భవిష్యత్తు కోసం మనమందరం కలసి నడవాల్సిన సమయం వచ్చింది. ఇది మన దేశ ఆత్మను కాపాడే గొప్ప ఊరేగింపు. మీ అందరినీ రాంలీలా మైదానంలో చూడటానికి ఎదురుచూస్తున్నాను" అని రాహుల్ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మరోవైపు నవంబర్ 1న రాంలీలా మైదానంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నిరసనకారులు జంతర్ మంతర్ లేదా ఇతర నిషేధిత ప్రాంతాల వైపు వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ర్యాలీకి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల నుంచి 50 వేల మంది వరకు ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 3,000 మంది పోలీసు సిబ్బందిని మైదానం చుట్టూ మోహరిస్తున్నారు. సభ జరిగే ప్రాంగణాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి 150 అత్యధునిక హై-డెఫినిషన్ (HD), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించి, భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి తాత్కాలిక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు.
వీవీఐపీలకు ప్రత్యేక నిష్క్రమణ మార్గాలు
{{/usCountry}}శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 3,000 మంది పోలీసు సిబ్బందిని మైదానం చుట్టూ మోహరిస్తున్నారు. సభ జరిగే ప్రాంగణాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి 150 అత్యధునిక హై-డెఫినిషన్ (HD), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించి, భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి తాత్కాలిక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు.
వీవీఐపీలకు ప్రత్యేక నిష్క్రమణ మార్గాలు
{{/usCountry}}సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాంలీలా మైదానానికి మొత్తం 8 ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్య ప్రతిపక్ష నేతల రాకపోకల కోసం ఒక ప్రత్యేక గేటును కేటాయించారు. అలాగే పోలీసు అధికారులు, ఇతర సీనియర్ విఐపిల కోసం మరొక గేటును కేటాయించారు. సభకు వచ్చే నిరసనకారుల వాహనాల పార్కింగ్ కోసం రాజ్‌ఘాట్, మాతా సుందరి కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి నిరసనకారులు కాలినడకన రామలీలా మైదానానికి చేరుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ పరిధిలోని ఇతర నిషేధిత ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.