రియల్‌మీ నుంచి పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్- లాంచ్‌కి ముందే ఫీచర్స్ లీక్..
రియల్‌మీ నుంచి పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు రెడీ అవుతోంది. అదే రియల్‌మీ 16 ప్రో. ఇందులో 16 ప్రోతో పాటు 16 ప్రో+ స్మార్ట్‌ఫోన్స్ ఉంటాయి. లాంచ్‌కి ముందే వీటికి సంబంధించిన అనేక ఫీచర్స్ లీక్ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
రియల్‌మీ మొబైల్ ప్రియులకు ఒక అదిరిపోయే వార్త! వచ్చే ఏడాది ఆరంభంలోనే సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో మన ముందుకు వస్తోంది రియల్‌మీ. 2026 జనవరి 6న మధ్యాహ్నం 12 గంటలకు ‘రియల్‌మీ 16 ప్రో’ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 16 ప్రో 5జీ’, ‘రియల్‌మీ 16 ప్రో+ 5జీ’ మోడల్స్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పటివరకు తెలిసిన ఆసక్తికరమైన విశేషాలను ఇక్కడ చూసేయండి..
రియల్‌మీ 16 ప్రో సిరీస్- సరికొత్త ‘అర్బన్ వైల్డ్’ డిజైన్..
ప్రముఖ జపనీస్ డిజైనర్ నావోటో ఫుకసావాతో కలిసి రియల్‌మీ ఈ ఫోన్లను అద్భుతంగా తీర్చిదిద్దింది. ఈసారి వీరు ‘అర్బన్ వైల్డ్’ అనే కొత్త డిజైన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నారు. మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే రంగులతో పాటు భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ‘కామెల్లియా పింక్’, ‘ఆర్చిడ్ పర్పుల్’ రంగులను తీసుకొస్తున్నారు.
రియల్‌మీ 16 ప్రో సిరీస్- బ్యాటరీ..
రియల్‌మీ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత కీలకమైన ఫీచర్ దాని ‘7,000ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ’. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చూడటానికి చాలా స్లిమ్‌గా ఉండటం విశేషం. దీనికి తోడు ‘ఏఐ లాంగ్-లైఫ్ బ్యాటరీ చిప్’, ‘సూపర్ పవర్ సేవింగ్ మోడ్’ వంటి ఫీచర్లు బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా చూస్తాయి. గేమింగ్ ప్రియుల కోసం బైపాస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.
రియల్‌మీ 16 ప్రో సిరీస్- అద్భుతమైన డిస్‌ప్లే & పెర్ఫార్మెన్స్
స్క్రీన్: 1.5కే రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లే ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఏకంగా 6,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్: 16 ప్రో మోడల్ ‘మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ 5జీ’ చిప్‌సెట్‌తో వస్తోంది. దీని అంటుటూ స్కోరు 9,70,000 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఫోన్ వేడెక్కకుండా ‘ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్’ కూలింగ్ సిస్టమ్‌ను కూడా జోడించారు.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘రియల్‌మీ UI 7.0’పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
కెమెరా: ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ ‘లూమాకలర్’ మెయిన్ కెమెరా ఉంది. ఇది 4కే హెచ్‌డీఆర్ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక రియల్‌మీ 16 ప్రో+ మోడల్‌లో అదనంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉండనుంది, దీని ద్వారా 100ఎక్స్ డిజిటల్ జూమ్ వరకు ఫొటోలు తీసుకోవచ్చు. ‘ఏఐ ఎడిట్ జెనీ 2.0’ ఫీచర్‌తో ఫొటోల్లోని బ్యాక్‌గ్రౌండ్ లేదా హెయిర్ స్టైల్‌ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.
రియల్‌మీ 16 ప్రో సిరీస్- ధర ఎంత ఉండొచ్చు?
లీకైన సమాచారం ప్రకారం.. రియల్‌మీ 16 ప్రో+ బాక్స్ ప్రైస్ (ఎంఆర్పీ) రూ. 43,999గా ఉండే అవకాశం ఉంది. అయితే ఆన్‌లైన్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే దీని అసలు ధర సుమారు రూ. 35,000 - 40,000 మధ్య ఉండవచ్చని టెక్ నిపుణుల అంచనా. ప్రో వేరియంట్ ధరల వివరాలు తెలియాల్సి ఉంది.
జనవరి 6న లాంచ్ అయిన తర్వాత ఈ రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


