ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ.. తన పాపులర్ సీ- సిరీస్‌లో సరికొత్త 'రియల్‌మీ సీ83 5జీ'ని భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, బ్యాటరీ, డిజైన్ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్‌మీ సీ83 5జీ- మార్చి 7న గ్రాండ్ లాంచ్..
రియల్‌మీ సీ83 5జీ స్మార్ట్‌ఫోన్ మార్చి 7వ తేదీన, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ అయిన వెంటనే రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఇది ‘బ్లూమింగ్ పర్పుల్’, ‘స్పౌటింగ్ గ్రీన్’ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.
రియల్‌మీ సీ83 5జీ- బ్యాటరీ..
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 7,000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ.
బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27.7 గంటల వీడియో ప్లేబ్యాక్, సుమారు 6.65 రోజుల మ్యూజిక్ ప్లేబ్యాక్, 37 రోజుల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఆరు ఏళ్ల భరోసా: ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల వరకు హెల్తీగా ఉంటుందని రియల్‌మీ హామీ ఇస్తోంది.
ఛార్జింగ్: ఇందులో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
రియల్‌మీ సీ83 5జీ- డిజైన్, డిస్‌ప్లే..
రియల్‌మీ సీ83 5జీ ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తోంది. వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఒక దీర్ఘచతురస్రాకార ఐలాండ్‌లో అమర్చి ఉంటుంది.
రిఫ్రెష్ రేట్: గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉండటం కోసం 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందించారు.
{{/usCountry}}రిఫ్రెష్ రేట్: గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉండటం కోసం 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను అందించారు.
{{/usCountry}}డ్యూరబిలిటీ: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్, అలాగే షాక్ రెసిస్టెన్స్ కోసం MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా ఉంది.
రియల్‌మీ సీ83 5జీ- ధర, వేరియంట్లు (అంచనా)..
లీకైన సమాచారం ప్రకారం, ఈ రియల్‌మీ సీ83 5జీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధరలు భారత్‌లో ఇలా ఉండవచ్చు:
4 జీబీ + 64 జీబీ: రూ. 13,499
4 జీబీ + 128 జీబీ: రూ. 14,499
6 జీబీ + 128 జీబీ : రూ. 17,499
బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక గొప్ప ఎంపిక కానుందని టెక్ నిపుణులు చెబున్నారు. లాంచ్ నాటికి ఈ గ్యాడ్జెట్‌కి చెందిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.