Budget Smartphone : 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో రియల్​మీ కొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​- ధర ఎంతంటే..

Realme P4 Lite 5g price : భారత మార్కెట్​లో మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. అదే రియల్​మీ పీ4 లైట్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. 7000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 24, 2026, 07:30:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్​లోకి తన 'పీ' సిరీస్‌లో సరికొత్త 5జీ ఫోన్‌ని ప్రవేశపెట్టింది. గతంలో వచ్చిన 4జీ మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా వస్తున్న ఈ రియల్‌మీ పీ4 లైట్ 5జీ.. ప్రధానంగా భారీ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ మొబైల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ పీ4 లైట్​ 5జీ.. (Realme )
రియల్​మీ పీ4 లైట్​ 5జీ.. (Realme )

రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

స్మార్ట్‌ఫోన్ ధరను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఫీచర్లను జోడించారు. అవేంటో చూద్దాం..

డిస్‌ప్లే: ఇందులో 6.8- ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ ఎల్​సీడీ స్క్రీన్ ఉంది. విశేషం ఏంటంటే, ఈ ధరలో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించడం గమనార్హం. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ప్రాసెసర్ అండ్ పనితీరు: ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6 ఎన్​ఎం ప్రాసెస్ మీద తయారైంది, దీనివల్ల బ్యాటరీ ఆదా అవ్వడమే కాకుండా 2.4 జీహెచ్​జెడ్​ వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. హీటింగ్ సమస్య తగ్గించడానికి ఇందులో 5,300 ఎంఎం² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

POCO X8 Pro : అదిరే ఏఐ ఫీచర్స్​తో పోకో ఎక్స్​8 ప్రో సిరీస్​- సేల్​ షురూ.. ధర, ఆఫర్లు ఇవే!

కెమెరా: ఈ రియల్‌మీ పీ4 లైట్ 5జీ ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండింటితో 1080పీ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముఖ్యంగా ‘ఏఐ లైవ్ ఫోటో’, ముందు-వెనుక కెమెరాలతో ఒకేసారి షూట్ చేసే 'డ్యూయల్ వ్యూ వీడియో' వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

బ్యాటరీ: ఈ స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్లు చాలా అరుదు. ఇది 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ అండ్ ఇతరాలు: ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్​ 16 (రియల్​మీ యూఐ 7) తో పనిచేస్తుంది. వాటర్​ అండ్​ డస్ట్​ నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఉంది. ఫోన్ బరువు 212 గ్రాములు, మందం 8.4ఎంఎంగా ఉంది.

రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ధర, లభ్యత..

రియల్‌మీ పీ4 లైట్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి..

4 GB + 64 GB- రూ. 12,999

4 GB + 128 GB- రూ. 13,999

6 GB + 128 GB- రూ. 15,999

రంగులు: ఇది మోజాయిక్ గ్రీన్, మోజాయిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ఎప్పుడు కొనవచ్చు?

ఈ ఫోన్ విక్రయాలు మార్చి 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More