Editorial independence is core to our work. Some links may earn us a commission, without influencing our opinions.

POCO X8 Pro : అదిరే ఏఐ ఫీచర్స్​తో పోకో ఎక్స్​8 ప్రో సిరీస్​- సేల్​ షురూ.. ధర, ఆఫర్లు ఇవే!

పోకో తన పవర్‌ఫుల్ ఎక్స్​8 ప్రో సిరీస్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచింది. ఇందులో పోకో ఎక్స్​8 ప్రో, పోకో ఎక్స్​8 ప్రో మాక్స్ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. రూ. 32,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 3,000 వరకు ఇన్​స్టెంట్​ డిస్కౌంట్ పొందవచ్చు.

Published on: Mar 23, 2026, 16:00:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
research icon

Research-Backed Choices

Every product we recommend is chosen through a combination of Primary Research and Secondary Research.

పోకో ఎక్స్​8 ప్రో సిరీస్.. (Xiaomi India)
పోకో ఎక్స్​8 ప్రో సిరీస్.. (Xiaomi India)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. గత వారం భారత మార్కెట్​లో విడుదల చేసిన పోకో ఎక్స్​8 ప్రో సిరీస్ అమ్మకాలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన డిస్​ప్లే, భారీ బ్యాటరీ, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర, ఆఫర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. పోకో ఎక్స్​8 ప్రో- స్పెసిఫికేషన్లు, ధర..

స్మార్ట్​ఫోన్ 6.69- ఇంచ్​ 1.5కే అమోలెడ్ డిస్​ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్.

కెమెరా: వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్​882 సెన్సార్, ఓఐఎస్​ సపోర్ట్), 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: 6,500 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీతో పాటు 100డబ్ల్యూ హైపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.

ధరలు: 8 GB + 256 GB: రూ. 32,999

12 GB + 256 GB: రూ. 35,999

12 GB + 256 GB (ఐరన్ మ్యాన్ ఎడిషన్): రూ. 37,999

2. పోకో ఎక్స్​8 ప్రో మాక్స్- విశేషాలు..

ఇది ఈ పోకో సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇందులో 6.83- ఇంచ్​ భారీ అమోలెడ్ డిస్​ప్లే ఉంది.

ప్రాసెసర్: ఇందులో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్​ చిప్‌సెట్‌ను వాడారు.

బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 8,500ఎంఏహెచ్​ బ్యాటరీ. దీనికి కూడా 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ధరలు: 12 GB + 256 GB: రూ. 42,999

12 GB + 512 GB: రూ. 46,999

AI House search : అద్దె ఇల్లు వెతకడం కష్టంగా ఉందా? 'ఏఐ' ఉండగా ఇక శ్రమ ఏందుకు?

పోకో ఎక్స్​8 ప్రో సిరీస్​- ఏఐ ఫీచర్లు..

ఈ రెండు ఫోన్లలో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ డైనమిక్ వాల్‌పేపర్స్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

పోకో ఎక్స్​8 ప్రో సిరీస్​- లాంచ్ ఆఫర్లు..

మొదటి సేల్‌లో భాగంగా, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల బేస్ మోడల్‌ను రూ. 29,999 కే సొంతం చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More