ఇటీవలి కాలంలో కాలి బూడిదైనపోయిన బస్సులాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం. బస్సు అగ్ని ప్రమాదానికి గురైతే మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గతంలోని ఘటనలు చెప్పే సత్యం కూడా ఇదే. బస్సులో లోపల ఉన్న ప్రయాణికులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటకు వెళ్లడానికి వీలుపడదు. దీంతో మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏసీ బస్సుల్లో ఇలాంటి అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

సాధారణ బస్సులో విద్యుత్ వినియోగం తక్కువే ఉంటుంది. కానీ ఏసీ బస్సుల్లో మాత్రం అధికంగా ఉంటుంది. సుమారు 15 కిలోవాట్లపైనే శక్తి కావాలి. ఈ అధిక విద్యుత్ కారణంగా కేబుల్స్ వేడెక్కుతాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి మంగళూరులాంటి సిటీలకు వెళ్లే బస్సులు ఎక్కువసేపు ప్రయాణం చేస్తాయి. గంటల ప్రయాణం ఉంటుంది.
ఈ సమయంలో ఏసీని ఆపకుండా నడిపితే ప్రమదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న తప్పిదంతో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. కంప్రెసర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేట్ వంటి భాగాలు ఓవర్‌లోడ్ అవుతాయి. విద్యుత్ కనెక్షన్స్ బలహీనపడతాయి. గుంతల రహదారుల్లో ప్రయాణం కూడా ప్రమాదాలు జరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బలహీనంగా ఉన్న కనెక్షన్లను మరింత బలహీనం అవుతాయి. అధిక వేగంలో ఉన్నప్పుడు వేసే సడెన్ బ్రేకులు కూడా వైరింగ్ బలహీనం కావడానికి కారణం అవుతాయి.
ప్రతీ 2 నుంచి 3 గంటలకు ఒకసారి 15 నుంచి 20 నిమిషాలు ఏసీ ఆపేయాలి. అయితే ఇప్పుడు దాదాపు అన్ని ఏసీ స్లీపర్ బస్సుల్లో కిటికీలు ఉండటం లేదు. కేవలం డ్రైవర్ సీటు దగ్గర మాత్రమే ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనే ఏసీని వాడాలి. అది కూడా విరామం ఇస్తూ ఉపయోగించాలి. అతివేగం, ఏసీని ఎక్కువగా వాడటం, ఫిట్‌నెస్ లేకపోవడంలాంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. ప్రయాణం ఎక్కువగా ఉన్నప్పుడు బస్సును మధ్యలో కాసేపు ఆపాలి. ఇంజిన్ అధిక వేడి కూడా మంటలు చెలరేగడానికి కారణం అవుతుంది.
బస్సుల్లో ప్లాస్టిక్ భాగాలు, రెగ్జీన్, కాటన్ వంటి మెటీరియల్తో సీట్లు తయారై ఉంటాయి. ఇవి వెంటనే అంటుకుని మంటలు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు బస్సుల్లోని ఆయిల్ ట్యాంకు, పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే పైపులు దెబ్బతినీ లీకవుతాయి. ప్రయాణం చేసి చేసి బస్సు ఇంజిన్ వేడిగా ఉంటుంది. ఆ భాగాలపై ఇంధనం పడి వెంటనే మంటలు చెలరేగుతాయి. బస్సుల్లో టీవీ, బల్బులు, ఫ్యాన్, ఏసీ వంటి పరికరాలకు క్వాలిటీ లేని వైరింగ్ వాడితే కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
{{/usCountry}}బస్సుల్లో ప్లాస్టిక్ భాగాలు, రెగ్జీన్, కాటన్ వంటి మెటీరియల్తో సీట్లు తయారై ఉంటాయి. ఇవి వెంటనే అంటుకుని మంటలు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు బస్సుల్లోని ఆయిల్ ట్యాంకు, పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే పైపులు దెబ్బతినీ లీకవుతాయి. ప్రయాణం చేసి చేసి బస్సు ఇంజిన్ వేడిగా ఉంటుంది. ఆ భాగాలపై ఇంధనం పడి వెంటనే మంటలు చెలరేగుతాయి. బస్సుల్లో టీవీ, బల్బులు, ఫ్యాన్, ఏసీ వంటి పరికరాలకు క్వాలిటీ లేని వైరింగ్ వాడితే కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
{{/usCountry}}