...
...
Next Story

Assembly Elections 2026 : కేరళ, అసోం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ఎన్నికలు​ - రికార్డు స్థాయిలో పోలింగ్, ఎంతంటే..?

అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ఎన్నికలు​ ముగిశాయి. అసోం, పుదుచ్చేరిలో రికార్డుస్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Published on: Apr 9, 2026, 22:25:18 IST
Advertisement

అసోం, , పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు రాష్ట్రాల్లోనూ ఈసారి భారీ సంఖ్యలోనే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా… ప్రశాంతంగానే ఎన్నికల ఓటింగ్ ముగిసింది.

ఓటర్లు
ఓటర్లు

ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు వేర్వేరు చోట్ల ఓటు వేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.

అసోం, పుదుచ్చేరి , కేరళ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ వివరాలను ఈసీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గత రికార్డులను అధిగమించి అత్యధిక స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది.

  • పుదుచ్చేరి: 89.83 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో 2011 ఎన్నికల్లో నమోదైన 86.19 శాతమే అత్యధికం.
  • అసోం: 85.38 శాతం పోలింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 84.67 శాతమే ఇప్పటివరకు అత్యధికం.
  • కేరళ : కేరళలో మొత్తం 78.03 శాతం పోలింగ్ నమోదైంది.
  • అసోంలో 84.80 శాతం పురుషులు, 85.96 శాతం మహిళలు ఓటేశారు.
  • కేరళలో పురుషులు 75.01 శాతం పోల్స్ నమోదు చేయగా, మహిళలు 80.86 శాతంగా ఉన్నారు.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 88.09 శాతం మంది పురుష ఓటర్లు ఓటు వేయగా, 91.33 శాతం మంది మహిళలు ఓటు వేశారు.

కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులు, పలువురు వీఐపీలు సామాన్యుల మాదిరిగా క్యూలైన్లలో నిలబడి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe