Redmi 17 : భారీ బ్యాటరీతో మార్కెట్లోకి రెడ్‌మీ 17 సిరీస్- ధర, ఫీచర్లు..

Redmi 17 launch : రెడ్‌మీ నుంచి సరికొత్తగా 17 5జీ, 17 4జీ స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యాయి. 7,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 11, 2026, 09:11:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం రెడ్‌మీ సంస్థ మరో శక్తివంతమైన సిరీస్‌ను పరిచయం చేసింది. చైనా మార్కెట్లో విడుదలైన కొద్దిరోజులకే రెడ్‌మీ 17 5జీ ఫోన్‌ను కొన్ని సెలెక్ట్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. దీనితో పాటు రెడ్‌మీ 17 4జీ మోడల్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కొత్త ఫోన్లు షియోమీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గ్లోబల్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. చైనా వెర్షన్‌లో ఉన్న యూనిసోక్ చిప్‌కు బదులుగా, గ్లోబల్ రెడ్‌మీ 17 5జీ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే 4జీ మోడల్ మీడియాటెక్ హెలియో జీ91-అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తోంది. ముఖ్యంగా ఈ రెండు స్మార్ట్​ఫోన్లలో అతిపెద్ద హైలైట్.. చైనా వెర్షన్‌తో పోలిస్తే వీటిలో ఏకంగా 7,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఉండటం.

రెడ్​మీ 17 స్మార్ట్​ఫోన్స్..
రెడ్​మీ 17 స్మార్ట్​ఫోన్స్..

రెడ్‌మీ 17 5జీ, రెడ్‌మీ 17 4జీ ధరలు..

రెడ్‌మీ 17 4జీ బేస్ వేరియంట్ (4జీబీ రామ్ + 128జీబీ స్టోరేజ్) ధరను ఎంవైఆర్ 669గా (మన కరెన్సీలో సుమారు రూ.16,000) నిర్ణయించారు. ఇక రెడ్‌మీ 17 5జీ ఇదే రామ్, స్టోరేజ్ ఆప్షన్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర ఎంవైఆర్ 769 (సుమారు రూ.18,000) నుంచి ప్రారంభమవుతుంది. ఇక అత్యుత్తమ వేరియంట్ అయిన 4జీబీ రామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన రెడ్‌మీ 17 5జీ ధర ఎంవైఆర్ 869 (దాదాపు రూ.20,000) వరకు ఉంది.

ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు మలేషియాలోని షియోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సేల్‌లో ఉన్నాయి. రెడ్‌మీ 17 4జీ బ్లాక్, డీప్ బ్లూ, లోటస్ పర్పుల్, ఓక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. మరోవైపు రెడ్‌మీ 17 5జీ బ్లాక్, డీప్ బ్లూ, వివిడ్ ఆరెంజ్ షేడ్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రెడ్​మీ 17 స్పెసిఫికేషన్లు, కీలక ఫీచర్లు..

రెడ్‌మీ 17 5జీ, రెడ్‌మీ 17 4జీ స్మార్ట్​ఫోన్లు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్‌ఓఎస్ 3 పై పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్లు ఒకేలాంటి 6.9 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 825 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం రెండు ఫోన్లకు ఐపీ64 రేటింగ్ లభించింది.

రెడ్‌మీ 17 5జీ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్ ఉండగా, 4జీ మోడల్‌లో మీడియాటెక్ హెలియో జీ91-అల్ట్రా ప్రాసెసర్‌ను పొందుపరిచారు. ఈ రెండు హ్యాండ్‌సెట్లు వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.

ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ అయిన 7,500ఎంఏహెచ్ బ్యాటరీ 45వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు, అలాగే 22.5వాట్ రివర్స్ వైర్డ్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్ల కొలతలు ఒకేలా ఉంటూ, సుమారు 232 గ్రాముల బరువును కలిగి ఉన్నాయి.

రెడ్​మీ 17 5జీ, రెడ్​మీ 17 4జీ స్మార్ట్​ఫోన్స్ ఇండియా లాంచ్​పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More