9000ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్- టర్బో 5 మ్యాక్స్ లాంచ్ ఈ నెలలోనే!
షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీ తన పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ 'టర్బో 5 మాక్స్'ను చైనాలో ఈ నెలలో విడుదల చేయనుంది. 9000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి రెడ్‌మీ సిద్ధమైంది. అసాధారణమైన బ్యాటరీ లైఫ్, అగ్రశ్రేణి పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం ‘రెడ్‌మీ టర్బో 5 మాక్స్’ మోడల్‌ను ఈ నెలలో చైనా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు ఈ షావోమీ సబ్-బ్రాండ్ అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- 9000ఎంఏహెచ్ బ్యాటరీతో..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏ షావోమీ ఫోన్‌లోనూ లేని విధంగా ఏకంగా 9000ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన ‘జిన్‌షాజియాంగ్’ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 10,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చే స్థాయి బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీనికి తోడు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు సమాచారం. బ్యాటరీ అయిపోతుందనే ఆందోళన ఇక ఈ ఫోన్ వాడేవారికి ఉండదు.
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- అద్భుతమైన పనితీరు..
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం బ్యాటరీలోనే కాదు, పవర్ పర్ఫార్మెన్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెలలోనే విడుదలైన ‘మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్’ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్‌గా ఇది నిలవనుంది. అన్‌టుటు బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ ఏకంగా 32,98,445 పాయింట్లను సాధించి, మార్కెట్లోని ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు సవాలు విసురుతోంది.
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- డిజైన్, కెమెరా విశేషాలు..
‘ఓషన్ బ్రీజ్ బ్లూ’ రంగులో మెరిసిపోతున్న ఈ ఫోన్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంది.
బాడీ: పటిష్టమైన సీఎన్‌సీ మెటల్ ఫ్రేమ్, ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తోంది.
కెమెరా: వెనుక వైపు పిల్-షేప్ మాడ్యూల్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.
డిస్ప్లే: ముందు వైపు పంచ్-హోల్ కెమెరా కటౌట్, చాలా సన్నని బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్ప్లే ఈ రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్‌లో ఉంది.
చైనాలో దీని ధర సుమారు 2,500 యువాన్లు (సుమారు రూ. 33,000) ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో, ముఖ్యంగా భారత్‌లో ఈ ఫోన్ ‘పోకో ఎక్స్8 ప్రో మాక్స్’ పేరుతో రీబ్రాండ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


