డిజిటల్ ఇండియా సేల్ షురూ.. ఐఫోన్, స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
రిలయన్స్ డిజిటల్ ప్రతిష్టాత్మక 'డిజిటల్ ఇండియా సేల్' ప్రారంభమైంది. జనవరి 26 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
టెక్ ప్రియులకు పండగ వచ్చేసింది! దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'రిలయన్స్ డిజిటల్' తన పాపులర్ 'డిజిటల్ ఇండియా సేల్'ను మళ్లీ తీసుకువచ్చింది. జనవరి 26, 2026 వరకు జరిగే ఈ భారీ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.

డిజిటల్ ఇండియా సేల్- ఆఫర్ల సునామీ..
కస్టమర్లు తమకు నచ్చిన గ్యాడ్జెట్లను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ డిజిటల్ అదిరిపోయే వెసులుబాటు కల్పిస్తోంది. బ్యాంకు కార్డులపై రూ. 26,000* వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లపై రూ. 30,000* వరకు క్యాష్‌బ్యాక్, యూపీఐ పేమెంట్స్‌పై అపరిమితంగా 5% డిస్కౌంట్ వంటి ఆఫర్లను అందిస్తోంది.
ఈ సేల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ (www.reliancedigital.in) అందుబాటులో ఉంటుంది.
సేల్‌లో ప్రధాన ఆకర్షణలు ఇవే:
ఐఫోన్లపై ముందెన్నడూ లేని ధరలు:
ఐఫోన్ 15 (128 జీబీ): కేవలం రూ. 49,990* ప్రారంభ ధరకే లభిస్తోంది. నెలకు రూ. 2,888* నుంచి ఈఎంఐ సదుపాయం ఉంది.
ఐఫోన్ 16 (128 జీబీ): రూ. 57,990* కే సొంతం చేసుకోవచ్చు. దీనికి నెలకు రూ. 3,388* ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
ఐఫోన్ 17 సిరీస్: కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 (256 GB) రూ. 78,900* కే అందుబాటులో ఉంది. ప్రో మోడల్ రూ. 1,30,900* నుంచి ప్రారంభమవుతోంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (విలువ రూ. 6,899*) ఉచితంగా పొందుతూ, కేవలం రూ. 64,990* కే ల్యాప్‌టాప్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
స్మార్ట్ టీవీలు అండ్ సౌండ్ సిస్టమ్స్:
తోషిబా 65 ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీని 2 ఏళ్ల వారంటీతో రూ. 44,990* కే విక్రయిస్తున్నారు.
ఏదైనా టీవీ కొనుగోలు చేస్తే, ఎంపిక చేసిన సౌండ్‌బార్లపై రూ. 10,000* వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక రూ. 899* కే పవర్ బ్యాంక్, ఛార్జర్ లేదా నెక్ బ్యాండ్ వంటి రెండు రీకనెక్ట్ ప్రొడక్టులను ఎంచుకోవచ్చు.
గృహోపకరణాలపై భారీ తగ్గింపు:
ఫ్రిజ్‌లు రూ. 7,999* నుంచి, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు రూ. 19,990* నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని రకాల ఫ్రిజ్‌ల కొనుగోలుపై ఐరన్ బాక్స్ (రూ. 9), బోట్ సౌండ్ బార్ (రూ. 49), లేదా ఎయిర్ ఫ్రైయర్ (రూ. 99) వంటి ఆఫర్లు ఉన్నాయి.
1.5 టన్ 3-స్టార్ ఏసీ రూ. 32,990* కే లభిస్తోంది. కొన్ని 5-స్టార్ ఏసీల కొనుగోలుపై మినీ బార్ ఉచితంగా ఇస్తున్నారు.
కిచెన్ అప్లయెన్సెస్ కొనుగోలుపై 50% వరకు డిస్కౌంట్‌తో పాటు రూ. 7,990* విలువైన గిఫ్ట్‌లు గ్యారెంటీగా పొందవచ్చు.
కేవలం అమ్మకాలే కాకుండా, 'రిలయన్స్ రెస్క్యూ' ద్వారా మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా అందిస్తామని సంస్థ పేర్కొంది.
టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్లను రూపొందించారు. ఇంకెందుకు ఆలస్యం? త్వరపడండి, స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు ఉంటాయి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


