ఈ ఏడాది 28శాతం పెరిగిన రిలయన్స్ స్టాక్.. అమ్మేయాలా? లేక ఇంకా కొనాలా?
ఇయర్-టు- డేట్లో రిలయన్స్ స్టాక్ ఏకంగా 28శాతం వృద్ధిని సాధించింది. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు రిలయన్స్ షేర్లను కొనొచ్చా? లేదా ఉన్నవి అమ్మేయాలా? రిలయన్స్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..
2025లో స్టాక్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒకటి! ఈ ఏడాది సెన్సెక్స్ 8% లాభాలను మాత్రమే ఆర్జించగా, రిలయన్స్ ఏకంగా 28% వృద్ధితో ఇన్వెస్టర్లు మంచి ప్రాఫిట్స్‌ని ఇచ్చింది. డిసెంబర్ 19, శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ షేరు 1.34% లాభంతో రూ. 1,565.10 వద్ద స్థిరపడింది.

నవంబర్ 28న రిలయన్స్ స్టాక్ రికార్డు గరిష్ఠాన్ని (రూ. 1,580.90) తాకింది. ఏప్రిల్ 7న తన 52 వారాల కనిష్ట స్థాయిని (రూ.1,115.55) నమోదు చేసిన ఈ స్టాక్, అప్పటి నుంచి అద్భుతంగా పుంజుకుంది.
మరి రిలయన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? లేక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రిలయన్స్ షేర్లలో లాభాలకు కారణం ఏంటి?
డైవర్సిఫైడ్ బిజినెస్, వృద్ధి కారకాలపై దృష్టి, ఆరోగ్యకరమైన త్రైమాసిక ఫలితాలు వంటివి రిలయన్స్ షేర్ల లాభాలకు ప్రధాన కారణాలు.
“రిలయన్స్ ఇండస్ట్రీస్ పునాదులు బలంగా ఉన్నాయి. క్యూ2 ఎఫ్వై26 ఫలితాలు దీనిని పునరుద్ధరించాయి. ప్యాట్‌లో 9శాతం (ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధి, పీబీటీ 16శాతం జంప్, 14.6 శాతం ఎబిట్డా వృద్ధి వంటివి బలమైన ఆదాయానికి నిదర్శనం. అంతర్జాతీయ ఎనర్జీ, కెమికల్ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నప్పటికీ రిలయన్స్ బలంగా నిలపడటం సానుకూల విషయం," అని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ సీమా శ్రీవాస్తవ తెలిపారు.
మరోవైపు జియో టెలికాం దిగ్గజంగా కొనసాగుతోందని, దీర్ఘకాల వృద్ధిని కలిగి ఉందని శ్రీవాస్తవ చెబుతున్నారు. ఆర్పూ పెరగడం, ఎబిట్డా వృద్ధి, 5జీ, ఏఐ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ల వ్యూహాత్మక పెట్టుబడులు రిలయన్స్‌కి కలిసొస్తున్నాయని వివరించారు.
"రిలయన్స్ రీటైల్ కూడా వేగంగా వృద్ధిచెందుతోంది. ఇది డబుల్ డిజిట్లో రెవెన్యూను డెలివరీ చేస్తూ, ఎబిడ్టా వృద్ధిని సాధించింది. అదే సమయంలో స్టోర్ల సంఖ్యను అగ్రెసివ్‌గా పెంచుకుంటోంది. జియోమార్ట్ ద్వారా చేస్తున్న హైపర్‌లోకల్ డెలివరీ ఉపయోగపడుతోంది," అని శ్రీవాస్తవ అన్నారు.
జియోస్టార్ మీడియా, స్ట్రీమింగ్ బిజినెస్ మరో అధిక-మార్జిన్ గల డిజిటల్ సెక్టార్. ఇందులో కూడా రిలయన్స్ ఎబిడ్టా మార్జిన్లు, భారీ యూజర్ ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ సంస్థకు సానుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
“గత కొన్ని నెలలుగా రిలయన్స్‌లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇవి స్థిరమైన వృద్ధికి షేర్హోల్డర్లకు మెరుగైన వాల్యూని ఇచ్చే విధంగా ఉన్నాయి. ఆర్ఐఎల్ క్రెడిట్ రేటింగ్‌ని ఎస్ అండ్ పీ బీబీబీ+ నుంచి ఏ- కి మార్చడం అత్యంత కీలక విషయం. దీని వల్ల సంస్థ ఆదాయం పెరుగుతుంది,” అని బొనాంజకు చెందిన రీసెర్చ్ ఎనలిస్ట్ అభినవ్ తివారి తెలిపారు.
ఇప్పుడు రిలయన్స్ షేరు కొనవచ్చా?
రిలయన్స్ రాబోయే ఏడాదిలో రూ. 1,700 స్థాయికి చేరుకోవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఏఐ వంటి భవిష్యత్ రంగాల్లో రిలయన్స్ చేస్తున్న పెట్టుబడులు రాబోయే దశాబ్ద కాలంలో భారీ లాభాలను తెచ్చిపెడతాయని వారు అంచనా వేస్తున్నారు.
రిలయన్స్ స్టాక్- టెక్నికల్ అనాలిసిస్ ఏం చెబుతోంది?
టెక్నికల్ చార్టుల ప్రకారం రిలయన్స్ షేరు ప్రస్తుతం చాలా బలంగా ఉందని, డైలీ చార్ట్‌లో డీఈఎంఏ లెవల్ని దాటిందని, ఇది ప్రైజ్ స్ట్రక్చర్కి మంచిదని ఆనంద్ రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌కి చెందిన ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ ఎస్ పాటిల్ తెలిపారు.
“కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత రిలయన్స్ మంత్లీ చార్ట్‌లో కప్- అండ్- హ్యాండిల్ బ్రేకౌట్ కనిపిస్తోంది. అప్‌సైడ్ ముమెంటమ్కి ఇది సిగ్నల్,” అని ఆయన వివరించారు.
“ఏడీర్ 20 ఎగువన ఉంది. అంటే ట్రెండ్ బలంగా ఉంది. ఆర్ఎస్ఐ 60 పైన ఉంది. ఇది పాజిటివ్ ముమెంటమ్కి, బయ్యింగ్ ఇంట్రెస్ట్‌కి సంకేతం,” అని వెల్లడించారు.
“ఈ సెటప్ ప్రకారం రిలయన్స్ టార్గెట్ రూ. 1680. స్టాప్ లాస్ రూ. 1470 (డైలీ ఛార్ట్ క్లోజింగ్). బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అనుసరించవచ్చు,” అని ఆయన స్పష్టం చేశారు.
రిలయన్స్ స్టాక్ రూ. 1580 లెవల్స్ దాటగలిగితే రూ. 1700- రూ. 1750 వరకు కూడా వెళ్లొచ్చని, 12 నెలల టార్గెట్ రూ. 1777 అని ఛాయిస్ బ్రోకింగ్‌కి చెందిన రీసెర్చ్ ఎనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. 1,470- 1,460 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉన్నాయని, వాటి కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చని సూచించారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


