తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండు రోజుల్లో 5 లక్షల కోట్ల పైనే!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపించాయి. రెండు రోజుల్లో భారీగా పెట్టుబడులు, ఎంవోయూలు జరిగినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

Updated on: Dec 9, 2025, 17:28:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరు అయ్యారు. ప్రభుత్వం అనుకున్నట్టుగానే భారీగా పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలు ఈ సమ్మిట్‌‌లో జరిగాయి.

తెలంగాణకు భారీగా పెట్టుబడులు
తెలంగాణకు భారీగా పెట్టుబడులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూలు, పెట్టుబడులు మెుత్తం కలిపి రూ.5.75కి చేరుకున్నాయి. డిసెంబర్ 8వ తేదీన రూ.2,43,000 కోట్లు, డిసెంబర్ 9వ తేదీన రూ.3.32 లక్షల కోట్లు పెట్టుబడులు, ఎంవోయూలు జరిగాయి. మెుత్తం 5 లక్షల కోట్లకుపైగా చేరుకుంది. ఇందులో పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం ఫారెస్ట్‌తోపాటుగా ఇతర రంగాలు కూడా ఉన్నాయి.

ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఎంవోయూలు చేసుకున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మరోవైపు ఫ్యూచర్ సిటీ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు వచ్చిన ప్రముఖులు తెలంగాణ విధానాలను ప్రశంసించారు.

మెుదటి రోజు దేశ, విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి. సుమారు రూ.2.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. పలు కంపెనీలు 35 ఎంవోయూలకు పైగా సంతకాలు చేశాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుడులకు ఒప్పందాలు జరిగాయి. డిసెంబర్ 9వ తేదీన రూ.3.32 లక్షల కోట్లపైనే పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ప్రకృతి, అభివృద్ధి కలిసి నడిచే బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలలో తెలంగాణను అగ్రగామిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ నది కేవలం నీటి వనరు మాత్రమే కాదు, అది హైదరాబాద్ జీవనాడి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

'రీజనల్ రింగ్ రోడ్డుతో కలిసిన రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ భవిష్యత్తు రవాణాకు వెన్నెముకగా మారుతుంది. వృద్ధిని విస్తరించడానికి, గ్రామీణ, పెరి-అర్బన్ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి రూపొందించిన బహుళ నమూనా వ్యవస్థ. రోడ్డు మార్గం వెంట రైలును ప్లాన్ చేస్తున్నారు.' అని సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More