హైదరాబాద్‌లో కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. పాత పగలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిందితులు పక్కా ప్రణాళికతో చంపేశారు. హత్య జరిగిన తీరు భయంకరంగా ఉంది. మెుదట కత్తులతో పొడిచి.. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ జవహర్ నగర్‌లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను వెంబడించారు. 54 ఏళ్ల రియల్టర్ వెంటరత్నం తన స్కూటీ మీద ప్రయాణిస్తుండగా దుండగులు అతన్ని వెంటపడ్డారు. మెుదట కత్తితో అతడిపై దాడి చేశారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో తుపాకీ శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన వెనుక మునుపటి శత్రుత్వం కారణమై ఉండవచ్చని తేలింది. ఈ సంఘటన వెనుక ఉన్న కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు వెంటరత్నం కుటుంబ సభ్యుల నుండి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు వెంకటరత్నంపై కూడా రౌడీ షీట్ ఉన్నట్టుగా తెలిసింది.
విద్యార్థిని మృతి
రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదివే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివానగర్‌కు చెందిన దాసరి హాసిని(18) ఘటకేసర్ మండలం పరిధిలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. శనివారం తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి బుల్లెట్ బైక్ మీద ఉప్పల్‌కు వెళ్లారు.
రాత్రి 2 గంటల సమయంలో ఘట్‌కేసర్ వైపు తిరిగి వస్తుండగా నారపల్లి జైన్ అపార్ట్‌మెంట్ సమీపంలో బైక్ అదుపు తప్లి కింద పడింది. వెనకాల కూర్చున్న హాసిని తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్షయ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


