Car discounts in June : కారు కొనాలా? ఈ 3 రెనాల్ట్ మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు..
Discounts on Renault cars : రెనాల్ట్ ఇండియా జూన్ 2026 నెలకు గాను తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో రూ.80,000 వరకు లాభాలను పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త కారు కొనాలనుకునే వారికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' సూపర్ ఛాన్స్ ఇచ్చింది. ఈ జూన్ నెలలో తన మోస్ట్ పాపులర్ మోడళ్లయిన ట్రైబర్, కైగర్, క్విడ్ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్, లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, గత నెల తరహాలోనే ఈ నెలలో కూడా 'రెనాల్ట్ డస్టర్' కారుపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదు.

రాష్ట్రాల వారీగా, కార్ల మోడళ్ల వారీగా ఈ నెలలో లభిస్తున్న ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము..
రెనాల్ట్ కైగర్ ఆఫర్లు: రూ.80,000 వరకు లాభాలు..
రెనాల్ట్ కైగర్ ఎస్‌యూవీలోని ఎంపిక చేసిన వేరియంట్లపై ఈ నెలలో అత్యధికంగా రూ.80,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, పాత కారు మార్చుకునే వారికి రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే రూ.15,000 వరకు లాయల్టీ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు.
మే నెల లాగే ఈ నెలలో కూడా దేశవ్యాప్తంగా రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.4,000 వరకు రూరల్ (గ్రామీణ ప్రాంతాల) ఆఫర్ లభిస్తోంది. అయితే తమిళనాడులో మాత్రం కార్పొరేట్ డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా అంటే రూ.15,000 వరకు ఉంది.
కాగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బేస్ వేరియంట్లు అయిన కైగర్ 'అథెంటిక్', 'ఎవల్యూషన్' మోడళ్లను కొనేవారికి కేవలం లాయల్టీ, స్క్రాపేజ్, రెఫరల్ బెనిఫిట్స్ మాత్రమే వర్తిస్తాయి.
మార్కెట్లో రెనాల్ట్ కైగర్ ధర రూ. 5.81 లక్షల నుంచి ప్రారంభమై రూ. 10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, స్కోడా కైలాక్, టాటా నెక్సాన్ వంటి గట్టి పోటీదారులతో తలపడుతోంది.
రెనాల్ట్ ట్రైబర్ ఆఫర్లు: రూ.60,000 వరకు తగ్గింపు
7-సీటర్ బడ్జెట్ కారుగా పేరొందిన రెనో ట్రైబర్ ఎంవై2025 (2025 మోడల్) యూనిట్లపై ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.60,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇక కొత్త ఎంవై2026 (2026 మోడల్) ట్రైబర్ కార్లపై కూడా రూ.25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది, కానీ క్యాష్ డిస్కౌంట్ మాత్రం కొద్దిగా తగ్గి రూ.25,000 గా ఉంది.
తమిళనాడులో ఈ కారుపై రూ.15,000 వరకు కార్పొరేట్ బోనస్ లభిస్తుండగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇది రూ.10,000గా ఉంది. దీనితో పాటు రూ.4,000 రూరల్ ఆఫర్ కూడా ఉంది. ట్రైబర్ కారు ప్రారంభ వేరియంట్ 'అథెంటిక్' పై కేవలం లాయల్టీ, స్క్రాపేజ్ బెనిఫిట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్ ధరలు రూ. 5.81 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.48 లక్షల వరకు ఉన్నాయి. ఇది నిస్సాన్ గ్రావైట్‌కు గట్టి పోటీని ఇస్తూనే, ఎక్కువ ధర ఉండే మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా రుమియన్, కియా క్యారెన్స్ వంటి పెద్ద ఎంపీవీ కార్లకు బడ్జెట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
రెనాల్ట్ క్విడ్ ఆఫర్లు: రూ.55,000 వరకు డిస్కౌంట్
రెనాల్ట్ బ్రాండ్ నుంచి వస్తున్న చిన్న కారు క్విడ్ లోని కొన్ని వేరియంట్లపై రూ.55,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ఉన్నాయి.
అర్హతను బట్టి దేశవ్యాప్తంగా రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ (తమిళనాడులో రూ.15,000 వరకు), రూ.4,000 రూరల్ ఆఫర్ కూడా వర్తిస్తాయి. క్విడ్ బేస్ మోడల్ 'అథెంటిక్' పై దేశవ్యాప్తంగా కేవలం లాయల్టీ, స్క్రాపేజ్ ఆఫర్లు మాత్రమే లభిస్తాయి. కానీ తమిళనాడులో మాత్రం దీని పై వేరియంట్ అయిన 'ఎవల్యూషన్' కు కూడా ఈ లాయల్టీ, స్క్రాపేజ్ బెనిఫిట్స్ వర్తింపజేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.3 లక్షల నుంచి రూ. 5.88 లక్షల మధ్య ఉంది. ఇది మార్కెట్లో మారుతీ సుజుకీ ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో కార్లకు ప్రధాన పోటీదారుగా ఉంది.
గమనిక: ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు అనేవి దేశంలోని వేర్వేరు నగరాలు, డీలర్‌షిప్‌లు, కార్ల స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు. కాబట్టి పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని రెనో షోరూమ్‌ను సంప్రదించడం మంచిది. అంతేకాదు, ఈ ఆఫర్లు జూన్ 15, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


